మధుమేహంతో బాధపడే రోగులు ఖచ్చితంగా ఆహార నియమాలను పాటించి తీరాలి. అప్పుడే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఈ వ్యాధిబారినపడినవారు ఆహార నియమం గురించి పడే తపన అంతా ఇంతా కాదు. దీనికి పడే ఒత్తిడి వారిలో అధికంగా ఉంటుంది. దీనికి ముందుగానే ఆహార నియమం కోసం కొన్ని ప్రణాళికలను ముందుగానే తయారు చేసుకుంటే చాలా మంచిది. అలాంటి ప్రణాళికా నియమాలు ఇలా ఉండాలంటున్నారు వైద్యులు.