గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chitra
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (09:33 IST)

ఆవు పాలు ఆరోగ్యానికి హానికరమా?

అప్పుడే పితికిన ఆవు పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని అందరు అనుకుంటారు. కానీ ఇది తప్పు అంటున్నారు పరిశోధకులు. పచ్చిపాలు బాగా వేడిచేయకుండా తాగినప్పుడు వాటిలోని బాక్టీరియా మన శరీరంలోకి చేరుతుందనీ, అందువల్ల క్షయ, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. 
 
పచ్చిపాల మీద ఉండే మీగడ, వెన్న కూడా ఆరోగ్యానికి హాని చేస్తాయట. పాలను అధిక ఉష్ణోగ్రత వద్ద కనీసం పదిహేను నుంచి ఇరవై సెకన్ల పాటు బాగా మరిగించిన తర్వాతే వాటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పసిపిల్లలకు ఇచ్చే పాలను మరింత ఎక్కువ సమయం మరిగించాలనీ, అప్పుడే వాటిలోని బాక్టీరియా నశిస్తుందని కూడా అంటున్నారు. అప్పుడే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు.