బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chitra
Last Updated : గురువారం, 1 సెప్టెంబరు 2016 (16:28 IST)

వర్షాకాలంలో పొడిదుస్తులే బెటర్.. తడిసిన దుస్తులు ధరించారో అంతే సంగతులు..

వర్షాకాలంలో వచ్చిందంటే దగ్గు, జలుబు, చర్మవ్యాధులూ చాలా ఇబ్బందిపెడుతుంటాయి. చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే సమస్యల్ని సులువుగా అధిగమించవచ్చు. వర్షాకాలంలో తడి ఎక్కువగా ఉండటంవల్ల త్వరగా బ్యాక్టీర

వర్షాకాలంలో వచ్చిందంటే దగ్గు, జలుబు, చర్మవ్యాధులూ చాలా ఇబ్బందిపెడుతుంటాయి. చిన్నపాటి జాగ్రత్తలతో వర్షాకాలంలో వచ్చే సమస్యల్ని సులువుగా అధిగమించవచ్చు. వర్షాకాలంలో తడి ఎక్కువగా ఉండటంవల్ల త్వరగా బ్యాక్టీరియా, ఫంగస్‌ ఇన్ఫెక్షన్స్‌ మన శరీరాన్ని చుట్టుముడతాయి. ఆసుపత్రిలో అడుగుపెట్టే యాభైశాతం మందిలో దగ్గు, జలుబు, చర్మసమస్యలతో బాధపడేవారే ఎక్కువగా ఉంటారు. 
 
అందుకే ఈ కాలంలో పొడిదుస్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి. కొంతమంది చిన్నపాటి చినుకులకు దుస్తులు తడిస్తే ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో మళ్లీ వాటినే ధరిస్తుంటారు. తడి దుస్తులు వేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి. మిగతా సీజన్ల కంటే వర్షాకాలంలోనే దుస్తుల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో బట్టలు ఉతికి చాలామంది లోపలే తాడుకట్టి ఆరేస్తుంటారు. అయితే ఇలా తడి దుస్తులను లోపలే ఆరేయడం అత్యంత ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
 
ఇలా ఆరిన దుస్తులు ధరించడం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయట. బయటకు తేమ ఆరిపోయినట్లు కనిపించినప్పటికీ... 30 శాతానికి పైగా తేమ లోపల దాగి ఉంటుందట. ఈ తేమ కలిగిన దుస్తులను నిత్యం ధరించడం వల్ల ఆస్తమా వచ్చే అవకాశముందని ఓ సర్వేలో తేలింది. ఇలా అసంపూర్తిగా ఆరిన దుస్తుల్లో ఫంగస్ చేరి చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయట. అంతేకాకుండా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఇలాంటి దుస్తులు ధరిస్తే ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశముందని ఆయన చెప్పారు. అందుకే వీలైనంత వరకూ బట్టలను ఆరుబయట ఆరబెట్టి వేసుకోవాలని సూచిస్తున్నారు.