బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (13:44 IST)

నీటిని తీసుకుంటున్నారా.. లేదంటే.. ప్రమాదమే..?

శరీరం 60 శాతం నీటితో నిండి ఉందని చెప్తున్నారు. అందుకు ప్రతిరోజూ కనీసం రెండులీటర్ల నీరు తప్పకుండా తీసుకోవాలి. కానీ, చాలామంది నీరు అసలు తాగరు. నీరు అధికంగా తీసుకోవడం వలన శరీరంలోని వ్యర్థపదార్థాలు తొలగిపోతాయి. దాంతో అనారోగ్య సమస్యలు అంటూ ఉండవు. నీటిని తక్కువగా మోతాదులో తీసుకోవడం వలన డీ హైడ్రేషన్‌కు దారితీస్తుంది.
 
దాంతో వాంతులు, జ్వరం, ఎక్కువగా చెమట పట్టడం, అతిగా మూత్ర విసర్జన జరుగుతుంది. అలానే శరీరంలోని ఫ్లూయిడ్స్ సరైన మోతాదులో లేకపోతే జీర్ణప్రక్రియపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యలు తొలగించుకోవడానికి నీరు తీసుకుంటే కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ నీరు సరైన మోతాదులో తీసుకుంటే హైడ్రేషన్ ప్రక్రియ సరిగా ఉంటుంది. 
 
రక్తప్రసరణకు సాఫీగా జరగాలంటే.. నీరు అధికంగా తీసుకోవాలి. శరీరానికి కావలసిన నీరు లేకపోవడంతో అలసట, కోపం ఎక్కువవుతుంది. కనుక రోజుకు 2 లేదా 3 లీటర్లు నీరు సేవిస్తే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నారు. ఈ నీటిని ఆహారం, స్పూప్స్, పండ్లు, కూరగాయలు, పాలు వంటి పదార్థాల్లో తీసుకుంటే శరీరానికి కావలసిన నీరు సమృద్ధి కాగలవు.  
 
మూత్రపిండాలకు నీరు చాలా అవసరం. ఇవి, శరీరంలో ఫిల్టర్లుగా పనిచేస్తాయి. నీరు అధికంగా తీసుకుంటేనే.. మూత్రపిండాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఒకవేళ నీరు సేవించకపోతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కనుకు రోజూ నీటిని తీసుకోవడం మానేయకండి..