గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Modified: గురువారం, 22 సెప్టెంబరు 2016 (17:57 IST)

అల్జీమర్ వ్యాధితో అవస్థలే.. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే....

అల్జీమర్స్ ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. అలాగే, కొన్ని క్షణాల క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాని ప

అల్జీమర్స్ ఎక్కువగా వయసు పైబడుతున్న వారిలో కనిపించే వ్యాధి. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం దీని ప్రధాన లక్షణం. పరిచయస్తులు ఎదురుగా ఉన్నప్పటికీ, వారిని గుర్తుపట్టలేని స్థితి. అలాగే, కొన్ని క్షణాల క్రితమే తమ చేతిలోని వస్తువును ఎక్కడ పెట్టారో కూడా గుర్తు రాని పరిస్థితి. ఈవేళ ప్రపంచంలో ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అయితే, ఈ అల్జీమర్స్‌కీ, ఒత్తిడికీ అవినాభావ సంబంధముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అల్జీమర్ ఏ వయసులోనైన రావచ్చు. 
 
చాలామంది వయసు మళ్ళిన వారిలో ఉన్న ఆలోచన ఏమిటంటే, ఈ వ్యాధి మన జీవితాన్ని తలకిందులు చేస్తుందని. వృద్ధాప్యంలో మతిమరుపు వచ్చిందంటే తమకు ఆల్జీమర్స్‌ వ్యాధి వచ్చిందేమోనని భయపడతారు. నిజానికి మతిమరుపులన్నీ అల్జీమర్స్‌ వ్యాధికి దారి తీయవు. సంబంధిత విషయంపై ఆసక్తిలేకపోయినా మతిమరుపు రావచ్చు. మతిమరపునకు చాలా కారణాలు దోహదం చేస్తాయి. ఉదాహరణకు పక్షవాతం, మెదడులో గడ్డలు, రక్తస్రావం వంటివి. అయితే రోగికి వచ్చిన మతిమరుపు అన్నది అల్జీమర్ కారణంగానేనని నిర్ధారణ చేయడం ఒకింత కష్టమైన పనే. దీనికి సిటి స్కాన్, ఎమ్మారై(బ్రెయిన్)వంటి పరీక్షలు దోహదపడుతాయి. ఇందులో మెదడు కుచించుకుపోయినట్లుగా కనిపించడాన్ని బట్టి అల్జీమర్స్‌గా గుర్తించవచ్చు.
 
అల్జిమర్ ఎక్కువగా వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది. 60 ఏళ్ల పైబడిన వారికి, 90 కిలోల బరువు ఉన్న వారికి ఈ వ్యాధి వస్తుంది. వ్యాధి మొదటి స్టేజీలో ఉన్నప్పుడే గుర్తించి వారికి ఆటలు, సోషల్ యాక్టివిటీస్‌ చేయించాలి. మంచి పోషకహారాన్ని అందిస్తే కొంత మేర మార్పు చేయవచ్చు. పక్షవాతాన్ని డయాబెటిస్‌ను నివారించడానికి అనుసరించే సాధారణ జీవనశైలి సూచనలే అల్జీమర్స్‌ను నివారిస్తాయి. వ్యాయామంతో 70-80 ఏళ్ల వయస్సు వచ్చినా సరే ఉల్లాసంగా ఉండొచ్చు. వారానికి 5 సార్లు 20 నుంచి 40 నిముషాలు నడిచేవాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. పొగ, మద్యం తాగడం పూర్తిగా మానివేయాలి. ఎక్కువగా పండ్లు, చిరుధాన్యాలు, ఆకుకూరలు మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి.
 
బ్లూ బెర్రీలు జ్ఞాపకశక్తిని పెంచడంతో బాటు ఇందులోని యాంటీఆక్సిడెంట్లు మెదడుకు సరిగా రక్తం సరఫరా అయ్యేలా చేసి చురుగ్గా పని చేసేలా చేస్తాయి. సాల్మన్ చేపలు - ఇందులోని ఒమెగా ఫ్యాట్స్ బ్రైస్ పవర్ పెంచి అల్జీమర్ వ్యాధి రాకుండా నివారిస్తాయి. అవిసె గింజలు: ఏయల్‌ఏ అనే ఆరోగ్యకరమైన కొవ్వులు సెన్సరీ సందేశాలను మెదడుకు చేర్చి మెదడుకు పదును పెడతాయి. కాఫీ-కెఫీన్‌ను మితంగా తీసుకుంటే మతిమరుపును పోగొట్టి అల్జీమర్ వ్యాధి రాకుండా చేయడమే కాక అందులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి. మిశ్రమ నట్స్ - వేరుశనగ గింజలు, ఆక్రోట్, బాదం లాంటి నట్స్ నిద్రలేమిని పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఏపిల్ జ్యూస్ "జ్ఞాపక రసాయనం" అసిటిల్కోలిన్ ఉత్పత్తిని పెంచుతుంది. చాకొలెట్ చాలా రుచికరమైన బ్రెయిన్ ఫుడ్. ముదురు రంగులోని చాకోట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఏకాగ్రతని, అవగాహనా శక్తిని పెంచి విద్యార్థులలో స్పందన, గ్రాహ్యక శక్తిని కూడా పెంచుతుంది.