శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By CVR
Last Updated : శనివారం, 3 జనవరి 2015 (15:34 IST)

తుమ్మితే స్వైన్‌ఫ్లూనా... గుర్తించడమెలా?

మనిషికి సోకే ప్రాణాంతక వ్యాధుల్లో స్వైన్‌ఫ్లూ ఒకటి.  స్వైన్‌ఫ్లూ పందుల నుంచి హెచ్1ఎన్1 అనే వైరస్ ద్వారా ఏర్పడుతుంది. ఈ వ్యాధి ఇటీవల కాలంలో మల్లీ విదృంభిస్తోంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో తుమ్ములు, దగ్గులు సర్వసాధారణం. వీటిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయో తెలియడం కష్టం. 
 
స్వైన్‌ఫ్లూ వ్యాధికి ప్రత్యేకంగా లక్షణాలు ఉండవని వైద్యులు పేర్కొంటున్నారు. సాధారణ  జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి వైద్యులు తెలుపుతున్నారు. 
 
ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్ల వెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు కూడా అవుతాయని పేర్కొంటున్నారు.
 
ఈ వ్యాధి గర్భిణులలకు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, చిన్న పిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉందని తెలుపుతున్నారు. కనుక ఏ మాత్రం సందేహం ఏర్పడినా వెంటనే వైద్యులను సంప్రదించి తగు చికిత్స పొందడం మంచిది.