బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By pnr
Last Updated : బుధవారం, 20 జులై 2016 (14:39 IST)

వృద్ధాప్యంలో స్త్రీపురుషులకు వచ్చే వ్యాధులేంటి?

ప్రతి ఒక్కరూ వృద్ధాప్య దశకు చేరుకునే సమయానికి పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటారు. వీటిలో లైంగిక ఆసక్తిని ప్రభావితం చేసేవీ ఎక్కువగానే ఉంటున్నాయి.

ప్రతి ఒక్కరూ వృద్ధాప్య దశకు చేరుకునే సమయానికి పలు రకాల వ్యాధుల బారిన పడుతుంటారు. వీటిలో లైంగిక ఆసక్తిని ప్రభావితం చేసేవీ ఎక్కువగానే ఉంటున్నాయి. సామాజిక ప్రతికూల భావనలకు ఈ జబ్బులు కూడా తోడవుతుండటంతో వృద్ధుల్లో లైంగిక ఆసక్తులు తగ్గిపోతాయని పరిశోధకులు గుర్తించారు.
 
ముఖ్యంగా హైబీపీ, మధుమేహం, పురుషుల్లో ప్రోస్టేట్‌ గ్రంథికి సంబంధించిన సమస్యలు, మూత్ర సమస్యలు, అంగస్తంభనలు లేకపోవటం, ఆల్జిమర్స్‌ వంటి మానసిక సమస్యలు ఉంటాయు. 
 
అలాగే, స్త్రీలల్లో ముట్లుడిగిన (రుతుచక్రం) అనంతరం ఎదురయ్యే ఇబ్బందులు, మూత్రం ఆపుకోలేకపోవటం, కాన్పుల కారణంగా జననాంగ ప్రదేశ కండరాలు బలహీనపడటం, ఎముకలు పెళుసుబారే ఆస్టియోపొరోసిస్‌ వంటి సమస్యలు అధికం.
 
వృద్ధాప్యంలో వాడే రకరకాల మందులు, అనివార్యంగా తలెత్తే కీళ్ల నొప్పులు, శరీరంలో కండ తగ్గి శుష్కించటం, అలసట, డస్సిపోవటం వంటివన్నీ కూడా లైంగిక జీవితాన్ని ప్రభావితం చేసేవే. ఒక వయసుకు చేరుకునే సరికి లైంగిక క్రియలో పాల్గొనటమంటే భయాలూ పెరుగుతాయి.