శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2016 (19:27 IST)

వంటకు ఉపయోగించిన నూనెనే మళ్లీమళ్లీ వాడితే ఏమవుతుందో తెలుసా?

ఒకసారి వినియోగించిన నూనెను వృధాగా పడవేసేందుకు మనసురాదు. అందుకే మళ్లీమళ్లీ వాడుతుంటారు. అయితే ఇలా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి ఉపయోగించడం ద్వారా మెదడుతో పాటు క్యాన్సర్ లాంటి వ్యాధులొచ్చే ప్రమాదము

ఒకసారి వినియోగించిన నూనెను వృధాగా పడవేసేందుకు మనసురాదు. అందుకే మళ్లీమళ్లీ వాడుతుంటారు. అయితే ఇలా వాడిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేసి ఉపయోగించడం ద్వారా మెదడుతో పాటు క్యాన్సర్ లాంటి వ్యాధులొచ్చే ప్రమాదముందని తాజా పరిశోధనలో తేలింది. 
 
బస్క్యూ దేశానికి చెందిన యూనివర్శిటీ నిర్వహించిన పరిశోధనలో ఒకసారి వంటకు ఉపయోగించిన నూనెను (అంటే గారెలు, బూరెలు చేసి మిగిలిన నూనెను) మళ్లీ కూరలు, వేపుళ్లలో చేర్చడం ద్వారా క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తేలింది. మళ్లీ మళ్లీ నూనెను వేడిచేయడం ద్వారా టాక్సిక్ ఆల్డీహైడ్స్‌ నూనె నుండి విడుదలవుతుందని, దీనితో మన శరీరానికి ముప్పు తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
మళ్లీ మళ్లీ వేడిచేసిన నూనెను వాడటం ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందవని, హార్మోన్లు, ఎంజైముల వ్యవస్థపై ఆ నూనె ప్రభావం చూపుతుందని పరిశోధకులు మరియా డొలొరెస్ గుయ్లెన్ చెప్పారు. 
 
మూడు రకాల నూనె (ఆలివ్, సన్ ఫ్లవర్, ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్)లపై ఈ పరిశోధన జరిగిందన్నారు. ఈ నూనెలను మళ్లీమళ్లీ వేడి చేయడం ద్వారా క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులతో ముప్పు పొంచి ఉందని పరిశోధకులు అంటున్నారు.