శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Updated : శనివారం, 18 జూన్ 2016 (13:42 IST)

టాటూలతో ఆరోగ్యానికి చేటు... ఆ ఉద్యోగాలకు అనర్హులు....

ఇటీవల కాలంలో ఎక్కువమంది యువతీయువకులు టాటూలు వేయించుకుంటున్నారు. చేతులు, భుజాలు, వీపుపై ఇష్టం వచ్చిన ఆకృతిలో బొమ్మలను వేయించుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలను ఆలోచించకుండా టాటూలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టా

ఇటీవల కాలంలో ఎక్కువమంది యువతీయువకులు టాటూలు వేయించుకుంటున్నారు. చేతులు, భుజాలు, వీపుపై ఇష్టం వచ్చిన ఆకృతిలో బొమ్మలను వేయించుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలను ఆలోచించకుండా టాటూలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. టాటూలకు వాడే రంగులతో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. టాటూకు ఉపయోగించే రంగులు, రసాయనాలు పడకపోతే దురద, ఎలర్జీ వస్తుంది. చిన్నచిన్న గడ్డలు, కురుపులు ఏర్పడతాయి. దీనికి ఉపయోగించే సూదులు శుభ్రంగా లేకపోవడంతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. 
 
గుర్తు వేయించుకున్న చోటు నుంచి చీము కారడం, నొప్పి ఉండటం, వాపు రావడం లాంటి లక్షణాలు కన్పిస్తాయి. ఒకరికి ఉపయోగించే సూదులు మరొకరికి ఉపయోగించడం వల్ల హెచ్.ఐ.వి. వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. టాటూకు ఉపయోగించే పౌడర్లను నీటిలో కలిపి పేస్టులా చేసి ఉపయోగిస్తారు. ఇందులో కొన్ని రసాయనాలు ఉంటాయి. పౌడరు తయారుచేయడానికి కొన్ని కంపెనీలు నాణ్యత పాటిస్తుండగా, మరికొన్ని నాణ్యతను పాటించడంలేదని తెలుస్తుంది. 
 
వీధుల్లోకి వచ్చి టాటూ వేసే వారిలో ఎక్కువమంది నాణ్యత లేని రసాయనాలు ఉపయోగిస్తున్నారు. టాటూను వేసుకోవడానికి తక్కువ ధర అవుతున్నా, తొలిగించుకోవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. యువత తెలుసో తెలియక ఉద్వేగంతో టాటూలు వేయించుకుంటున్నారు. కొన్నేళ్ళ తరువాత జీవనశైలి మారుతుంది. అయినా వాటి గుర్తులే వెంబడిస్తాయి. పరోక్షంగా మనసుపై ప్రభావం చూపుతాయి. ఏకాగ్రత దెబ్బతింటుంది. పోలీసు, ఆర్మీ వంటి ఉద్యోగాలకు టాటూలు ఉంటే అనర్హులుగా ప్రకటిస్తున్నారు.