బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By chj
Last Modified: శుక్రవారం, 12 ఆగస్టు 2016 (19:38 IST)

క్యాన్సర్ కణజాలాలను నాశనం చేసే ఏడు ఆహార పదార్థాలు

రెడ్ వైన్ : రెడ్ వైన్లో శక్తివంతమైన రేస్వరాట్రోల్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సాదారణంగా ద్రాక్ష తొక్కలో ఉంటుంది. రేస్వరాట్రోల్ బాక్టీరియాలను, వైరస్‌లను నాశనం చేస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా దీనివలన ఎన్నో ఉపయోగాలున్నాయి. గుండె

రెడ్ వైన్ : రెడ్ వైన్లో శక్తివంతమైన రేస్వరాట్రోల్ అనే యాంటి ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సాదారణంగా ద్రాక్ష తొక్కలో ఉంటుంది. రేస్వరాట్రోల్ బాక్టీరియాలను, వైరస్‌లను నాశనం చేస్తాయని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా దీనివలన ఎన్నో ఉపయోగాలున్నాయి. గుండె పని చేసే విధానాన్ని మెరుగుపరచడం, కణజాలాలను వృద్ధి చేయడం వంటి ఎన్నో ఉపయోగాలున్నాయి. రోజుకు రేస్వరాట్రోల్ మోతాదు 200 నుంచి 600 ఎంసిజి కావాల్సి ఉంటుంది. అయితే 225 మీ.లీ రెడ్ వైన్లో ఇది 640 ఎంసిజి ఉంటుంది.
 
పసుపు : పసుపు వలన ఎన్నో రకాల ఉపయోగాలతో పాటు కొవ్వును కరిగించే గుణం కూడా ఉంది. 
బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్: ఈ పండ్ల వలన కొన్ని రకాల కేన్సర్‌లను నివారించవచ్చు. అంతేకాకుండా రక్త కేశనాళికల అభివృద్ధి ఆపడానికి మరియు ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడతాయి.
 
టమోటాలు : టమాటా సాస్ గాని, వండిన టమోటా గాని నెలకు నాలుగుసార్లు తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను దాదాపు 50 శాతం రాకుండా నివారించవచ్చు. టమోటాల్లో లైకోపిన్ అధికంగా ఉండి రక్త కేశనాళికల అభివృద్ధి కాకుండా చేస్తుంది.
డార్క్ చాకొలేట్: క్యాన్సర్ పేషెంట్లు పూర్తిగా స్వీట్లకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. డార్క్ చాకొలేట్ అనేది ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూ, ప్రాణాంతక కణాలను నాశనం చేస్తుంది.
కాఫీ మరియు గ్రీన్ టీ: కాఫీ మరియు గ్రీన్ టీలు ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా వివిధ రకాల కేన్సర్లను దూరం చేస్తాయి.