బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 ఆగస్టు 2020 (15:30 IST)

కరోనావైరస్ వచ్చింది, పోయింది, మాస్కు వేసుకుని శృంగారం చేస్తే వైరస్ వస్తుందా?

కరోనావైరస్ సోకిన తర్వాత కోలుకున్నవారిలో ఇదే సందేహం... అసలు కరోనావైరస్ శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందా? ఎన్ని రోజులకి భాగస్వామితో శృంగారంలో పాల్గొనవచ్చు.. వంటి సందేహాలకు సరైన సమాధానాలు ఏమిటన్నవి చూద్దాం.
 
ప్రస్తుతానికి, కరోనావైరస్ లైంగిక సంపర్కం ద్వారా సోకుతుందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవు. COVID-19 నిర్ధారణ అయిన 31 రోజుల తరువాత, చైనాలో 34 మంది మగ రోగుల వీర్యాన్ని తాజా అధ్యయనం పరీక్షించింది. వారి వీర్యంలో వైరస్ యొక్క జాడలను కనుగొనలేదు.
 
కానీ, లైంగిక కార్యకలాపాలలో ఖచ్చితంగా భాగస్వామికి చాలా సన్నిహితంగా ఉండాలి. సిఫారసు చేయబడిన ఆరు అడుగుల దూరం సాధ్యం కాదు. అంటే భాగస్వామికి సోకినట్లయితే, వైరస్ సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా, సంభోగంలో సాధారణంగా ముద్దు ఉంటుంది, ఇది వైరస్ బిందువుల ద్వారా వ్యాపిస్తుందని మనకు తెలుసు. కాబట్టి ఇది ఖచ్చితంగా వ్యాప్తి చెందుతుంది.
 
శృంగారం సమయంలో మాస్క్ వేసుకుని చేస్తే వైరస్ వస్తుందా?
శృంగారం సమయంలో మాస్కు ధరించడం సురక్షితమేనా అనేది కొందరి ప్రశ్న. ఐతే ఇది ఎంతమాత్రం సురక్షితం కాదు. ఫేస్ మాస్క్ లేదా ఫేస్ కవర్ అంతిమ నివారణ సాధనం కాదు. సంభోగం సమయంలో ఇవి ఎంతమాత్రం వైరస్‌ను అడ్డుకోలేవు.
 
కోవిడ్ తగ్గింది నెగటివ్ వచ్చింది, శృంగారంలో పాల్గొనవచ్చా?
వైరస్ కాలం 2-14 రోజులు అని పలు పరిశోధనల్లో తేలింది. ఐతే కోవిడ్ వున్నవారిలో మరో రెండు వారాల పాటు లక్షణాలను చూపించకపోవచ్చు. అదనంగా, COVID-19 యొక్క లక్షణరహిత కేసులపై చాలా పరిశోధనలు జరిగాయి. అంటే నెగటివ్ అని తేలినా వారి శరీరం నుంచి వైరస్ పూర్తిగా వెళ్లిపోయిందని చెప్పలేం. శృంగారంలో పాల్గొనక తప్పదు అనుకుంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించి సూచనలు తీసుకోవాల్సిందే.