శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 25 జనవరి 2016 (12:08 IST)

వైద్య గుణాలు కలిగిన కలబంద.. నిర్జీవ కణాల తొలగింపుకు బెస్ట్

కలబంద వైద్య గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది. కలబంద యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని మృదువుగా మార్చటమే కాకుండా, ముఖ చర్మంపై ఉండే నిర్జీవ కణాలను తొలగిస్తుంది. కలబంద చర్మానికి తేమని అందిస్తుంది.
 
కలబంద వలన వెంట్రుకలకు, చర్మానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయి. అందాన్ని మెరుగుపరిచే అన్ని రకాల ఉత్పత్తులలో కలబందను విరివిగా వాడుతున్నారు. అంతేకాకుండా కలబంద కాలిన గాయాలను కూడా తగ్గిస్తుంది.
 
కలబంద చర్మంపై గాయాలను త్వరగా తగ్గించి సహజంగా మెరుగుపరిచేలా చేస్తుంది. జిడ్డు చర్మానికి మృదువుగా మారుస్తుంది. మినరల్ - ఆధారిత - మేకప్ ఉత్పత్తులను వాడే స్త్రీలు, కలబందను వాడటం వలన చర్మానికి కావల్సిన తేమను అందించి, చర్మం పొడిగా అవటాన్ని నివారిస్తుంది.
 
కలబంద రసం, కొల్లాజన్ మరియు ఎలాస్టిన్‌‌లను మరమ్మత్తు చేసి చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉండేలా చేస్తుంది. మన చర్మంపై ఏర్పడిన తెగుళ్లును, దురద, మంటలను తగ్గిస్తుంది. కలబంద రసం తాగినపుడు, సహజంగా శరీరం జీర్ణక్రియ వ్యవస్థను శుభ్రపరచుకుంటుంది. శరీర క్రియలను సరైన స్థాయిలో నిర్వహించి బరువు నియంత్రణలో పాల్గొని శక్తి స్థాయిలను పెంచుతుంది.
 
కలబంద రసం చిగుళ్ళు, నోటిలో కలిగే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ రసం యాంటీ మైక్రోబియల్ గుణాలను మాత్రమే కాకుండా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా విటమిన్, మినరల్‌లను కలిగియుంటుంది. ముఖ్యంగా నోటి అల్సర్ లేదా చిగుళ్ళ నుండి రక్తస్రావం జరిగినపుడు శుభ్రమైన కలబంద రసం వాడమని వైద్యులు నిపుణులు సలహా ఇస్తుంటారు.