శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (12:20 IST)

గోబీతో క్యాన్సర్‌కు చెక్.. బరువు తగ్గాలంటే..?

గోబీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోబీ పువ్వుతో తయారు చేసే వంటలు రుచిని ఇవ్వడంతో పాటు క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. క్యాలీఫ్లవర్‌లో సల్ఫోరఫెన్ వంటి కెమికల్స్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తుంది. గోబీలో

గోబీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గోబీ పువ్వుతో తయారు చేసే వంటలు రుచిని ఇవ్వడంతో పాటు క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. క్యాలీఫ్లవర్‌లో  సల్ఫోరఫెన్ వంటి కెమికల్స్ క్యాన్సర్‌తో పోరాటం చేస్తుంది. 
 

గోబీలో ఇండోల్-3 కర్బినల్ అనే స్టెరాల్ జీవ రసాయనం వుండటం ద్వారా.. క్యాన్సర్ కారకాలను నశింపజేస్తుంది. తద్వారా ప్రోస్టేట్, పెద్దపేగు, రొమ్ము, ఒవేరియన్ క్యాన్సర్లు దూరమవుతాయి. అలర్జీలు, జలుబును కూడా క్యాలీఫ్లవర్ నియంత్రిస్తుంది. హార్మోన్ల సమతౌల్యతకు క్యాలీఫ్లవర్ బాగా ఉపయోగపడుతుంది. 
 
కంటి జబ్బులకు క్యాలీఫ్లవర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. డయాబెటిస్, పక్షవాతం, మెదడుకు సంబంధించిన వ్యాధులను దరిచేరనివ్వదు. గోబీలో కొలెస్ట్రాల్ దాదాపుగా ఉండదు కాబట్టి గుండెజబ్బులు ఉన్న వాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. అంతేగాకుండా అన్ని రకాల గుండెజబ్బులను నివారిస్తుంది.

బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించి స్థూలకాయాన్ని తగ్గించే గుణాలు గోబీలో వున్నాయి. గోబీ గాయాల దెబ్బల వల్ల కలిగే వాపు, మంట, నొప్పులను తగ్గిస్తుంది. ఇంకా శరీరంలోని టాక్సిన్లను ఇది దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.