లిఫ్ట్ ఉపయోగిస్తున్నారా? మెట్లెక్కుతున్నారా?

లిఫ్ట్ ఉపయోగిస్తున్నారా? మెట్లెక్కుతున్నారా?.. లిఫ్ట్ అధికంగా ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెట్లు ఎక్కడం దిగడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుత

selvi| Last Updated: ఆదివారం, 15 ఏప్రియల్ 2018 (11:59 IST)
లిఫ్ట్ ఉపయోగిస్తున్నారా? మెట్లెక్కుతున్నారా?.. లిఫ్ట్ అధికంగా ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెట్లు ఎక్కడం దిగడం ద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు సూచిస్తున్నారు. రోజుకు పది నుంచి 15 నిమిషాల పాటు మెట్లెక్కడం వల్ల గుండెకు మేలు జరుగుతుందట.
 
ఇంకా శరీరంలోని అధిక కెలోరీలు కూడా కరుగుతాయని.. తద్వారా బరువు కూడా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మెట్లు పది నిమిషాల పాటు ఎక్కడ దిగడం చేయడం.. నడక, స్కిప్పింగ్ వంటివి చేసినా సులభంగా బరువు తగ్గుతారు. అలాగే గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. మెట్లెక్కడం ద్వారా ఎముకలు, కండరాలు బలపడతాయి. 
 
అలగే మెట్లెక్కేటప్పుడు నెమ్మదిగా కాకుండా కాస్త వేగంగా ఎక్కేలా చూసుకోవాలి. ఇలా రోజులో కనీసం పది నిమిషాలు మెట్లెక్కినా లాభం వుంటుంది. ఇలా చేస్తే.. మోకాళ్లకు మంచి వ్యాయామం అందించినవారవుతారని... ఇంకా బరువు తగ్గి స్లిమ్‌గా తయారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :