బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 నవంబరు 2016 (16:01 IST)

ఊపిరాడట్లేదా? శ్వాస తీసుకోవడం కష్టమవుతుందా? కొత్తిమీర జ్యూస్ తీసుకోండి.

కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే శ్వాస సమస్యలను దూరం చేసుకోవచ్చు. రక్తహీనతకు చెక్ పెట్టే కొత్తిమీర ఊపిరి సరిగ్గా అందకుండా బాధపడేవారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. శ్వాస సమస్యల్ని తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ

కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే శ్వాస సమస్యలను దూరం చేసుకోవచ్చు. రక్తహీనతకు చెక్ పెట్టే కొత్తిమీర ఊపిరి సరిగ్గా అందకుండా బాధపడేవారికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. శ్వాస సమస్యల్ని తగ్గించుకోవాలంటే.. ప్రతిరోజూ ఉదయం కొత్తిమీర రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని, ఆస్తమా వంటి సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
అలాగే కొత్తిమీర రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది. ఒత్తిడీ తగ్గుతుంది. హృద్రోగాలు ఉన్నవారికీ కొత్తిమీర మంచిది. కొత్తిమీరలోని ఇనుము రక్తహీనతకు చెక్ పెడుతుంది. నోటిపుండ్లు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను కొత్తిమీరను రోజూ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. కొత్తిమీరలో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికం. దీన్ని తినడం వల్ల నోటిపుండ్లు వెంటనే తగ్గిపోతాయి. రోజులో మూడు సార్లు కొత్తిమీర ఆకులను నములుతూ, రసాన్ని దవడన ఉంచుకొని మెల్లగా మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చాలా త్వరగా నోటిపూత తగ్గుతుంది.
 
కొత్తిమీరలో క్యాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మహిళలు కొత్తిమీరను తీసుకోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గకుండా ఉంటుంది. చిన్నవయసు నుంచే పిల్లలకు ప్రతిరోజూ తినడం అలవాటు చేయాలి. ఇలా చేస్తే ఎముకలు బలంగా ఉంటాయి. పరగడుపున నాలుగేసి ఆకుల్ని నమలడం ద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. ఇంకా జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.