శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (10:43 IST)

పెరుగులో వాము కలిపి తీసుకుంటే..?

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటి వేసవి కాలంలో చల్ల చల్లని పెరుగును తింటే వచ్చే మజాయే వేరు. పెరుగు తీసుకోవడం వలన వేసవి తాపంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. పెరుగుని కింద సూచించిన విధంగా ఉపయోగిస్తే.. కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం.. 
 
కప్పు పెరుగులో కొద్దిగా నల్ల మిరియాల పొడి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కడుపునొప్పితో బాధపడేవారు తరచు పెరుగులో వాము కలిపి తింటే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
 
నల్ల ఉప్పును బాగా పొడి చేసుకోవాలి. ఈ ఉప్పును కప్పు పెరుగులో కలుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు దూరమవుతాయి. ప్రధానంగా గ్యాస్, అసిడిటీ వంటివి తగ్గుతాయి. కప్పు పెరుగులో కొన్ని ఓట్స్ కలిపి తింటుంటే కండరాల పుష్టికి దోహదం చేస్తాయి.
 
పెరుగులో కొద్దిగా పసుపు, అల్లం కలిపి తినాలి. ఇలా చేయడం వలన శరీర రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. పలురకాల ఇన్‌ఫెక్షన్స్, వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ కలిపి తింటే శరీరానికి తగినంత విటమిన్ సి లభిస్తుంది.