శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2017 (11:39 IST)

బరువు తగ్గాలా రోజుకో ఆపిల్ తినండి.. కొబ్బరిని కూడా వాడాలి..

బరువు తగ్గాలా రోజుకో ఆపిల్ తినండి.. రోజు యాపిల్ తినడం వలన సుళువుగా బరువు తగ్గొచ్చు. మామూలు పండ్లు మాదిరిగా యాపిల్‌లోృ కొవ్వుకు సంబంధించిన మూలకాలు ఉండవు. అంతేకాదు, యాపిల్‌లో ఉండే మూలకాలు కొవ్వును కరిగి

బరువు తగ్గాలా రోజుకో ఆపిల్ తినండి.. రోజు యాపిల్ తినడం వలన సుళువుగా బరువు తగ్గొచ్చు. మామూలు పండ్లు మాదిరిగా యాపిల్‌లోృ కొవ్వుకు సంబంధించిన మూలకాలు ఉండవు. అంతేకాదు, యాపిల్‌లో ఉండే మూలకాలు కొవ్వును కరిగించే శక్తిని కలిగి ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ఆపిల్ నివారిస్తుంది. యాపిల్ ఈ డిమోంటియానిని తగ్గిస్తుంది. దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది. 
 
ఇక యాపిల్ లో విటమిన్ ఏ, సి,ఇ,కె, ఫోలెట్ వంటివి ఉంటాయి. ఈ మూలకాలు శరీరానికి అవశ్యకమైన మూలకాలు. రోజు యాపిల్ తీసుకోవడం వలన రక్తనాళాలు శుభ్రమవుతాయి. రక్తనాళల్లో అడ్డంకులు తొలగిపోతే గుండె సరిగ్గా పనిచేస్తుంది. అంతేకాదు, శరీరానికి తగిన ప్రాణవాయువు సరఫరా అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుంది. శరీరం ఉత్తేజితమౌతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే బరువు తగ్గాలంటే.. నోట్లో పళ్లున్నంత కాలం జ్యూస్‌లు చేసుకుని తాగే బదులు కూరగాయలు, పళ్లను చక్కగా నమిలి తినండి. చెరకు రసం విషాలను హరిస్తుంది. కాబట్టి తాజా రసం తాగండి. కేక్‌, బిస్కెట్‌, బ్రెడ్‌, పాస్టా, పిజ్జా... వీటిని మీ ఆహార జాబితాలో నుంచి తక్షణమే తీసేయాలి.  
 
బరువు తగ్గటం కోసం ఆలివ్‌, రైస్‌ బ్రాన్‌ నూనెలే వాడాల్సిన అవసరం లేదు. వెజిటబుల్‌ ఆయిల్స్‌ కంటే విత్తనాల నుంచి తీసిన నూనెలే మేలైనవి. వేరుశనగ, ఆవాలు, కొబ్బరి, నువ్వుల నూనెలు రిఫైన్డ్‌ అయిల్స్‌ కంటే ఉత్తమమైనవి.
 
కొబ్బరి జీరో కొలెస్టరాల్‌ ఫుడ్‌. శరీర బరువును తగ్గిస్తుంది కూడా. కాబట్టి వీలైనంత ఎక్కువగా కొబ్బరిని వాడాలి. దోసెలు, ఇడ్లీల్లో చట్నీగా వాడొచ్చు. పోహా, కూరల్లో కొబ్బరి కోరు చల్లుకుని తినడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.