బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 21 నవంబరు 2015 (16:09 IST)

కుర్చీలో ఒకే భంగిమలో కూర్చొంటే వెన్నునొప్పి తప్పదట!

చాలా మంది పొద్దస్తమానం కుర్చీలో కూర్చొంటారు. ఇలాంటి వారు ఒకే భంగిమ (పద్ధతి)లో ఎక్కువ సేపు కూర్చున్నా.. వాహనాలు నడిపినా వెన్నునొప్పి తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా ఇలాంటివారు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని, విశ్రాంతి తీసుకోకపోతే వెన్ను సమస్యలు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు.
 
ముఖ్యంగా.. వెన్నుకు విరామం ఇవ్వకుండా చేస్తుండడంతో వెన్నుపూసపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దాదాపు 80 శాతం మంది ఏదో ఒక సమయంలో స్పైన్‌ సమస్యను ఎదుర్కొంటున్నారని వైద్యులు చెపుతున్నారు. ప్రధానంగా డెస్క్‌ వర్క్‌ చేసే వారు, బైక్‌ ఎక్కువ సేపు డ్రైవింగ్‌ చేసే వారు, గంటల తరబడి నిల్చోని పనిచేసే వారిలో స్పైన్‌ సమస్యలు అధికమవుతున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. వెన్ను సమస్యలు, నివారణ పద్ధతులపై అవగాహన కల్పించడానికి ప్రతి యేటా వరల్డ్‌ స్పైన్‌ డేను కూడా నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. 
 
సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో వెన్ను సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఉద్యోగులు కూర్చొని ఉన్నప్పుడు నడుము మీద మూడు రెట్లు ఎక్కువ ఒత్తిడి పడుతోంది. సరిగ్గా కూర్చోకపోవడం, జంక్‌ఫుడ్‌, ఆల్కాహాల్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. కంప్యూటర్‌ వద్ద కూర్చున్న సమయంలో సరైన ఎత్తులో చైర్‌ లేకపోయినప్పటికీ నడుము నొప్పి రావడానికి కారణమవుతోంది.
 
ప్రస్తుతం యువతలో వెన్ను సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. 12 నుంచి 20 సంవత్సరాల వారు 10 శాతం, 20 నుంచి 30 వయస్సు వారు 25 శాతం, 30 నుంచి 50 ఏళ్ల వారు 45 శాతం, 50 నుంచి 70 ఏళ్ల వారు 20 శాతం వెన్ను సమస్యలను ఎదురొంటున్నారని వైద్యులు తెలిపారు.