గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (17:19 IST)

చలికాలంతో మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఎలా?

దేశ వ్యాప్తంగా చలికాలం మొదలైంది. ఇప్పటికే విశాఖ మన్యాన్ని మంచు దుప్పటి పూర్తిగా కప్పేసింది. ఉదయం 10 గంటలైనా ఈ మంచు తెరలు తొలగిపోవడం లేదు. అలాగే, సాయంత్రం ఆరు కాకముందే చీకటి మాటున చలి గిలిగింతలు పెడుతోంది. చలిపంజాకు పారాహుషార్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కొక్కరు రెండు మూడు దుప్పట్లు కప్పుకోవడం.. ఉదయం, సాయంత్రం చలిమంటలు వేసుకోవడం చూస్తుంటాం. సిటీలోనూ ఎక్కడోచోట ఇలాంటి దృశ్యాలు చూస్తూనే ఉంటాం. కానీ వీటిద్వారానే పూర్తిగా చలి నుంచి విముక్తి పొందడం అందరికీ సాధ్యం కాదు. చలి నుంచి విముక్తి పొందడం అంటే ఒక్క చలిమంటలే కాదు. చాలా ఉన్నాయి. 
 
చలికాలం రాగానే అప్పటివరకు ఉన్న డ్రెస్సింగ్ పూర్తి భిన్నంగా మారుతుంది. గతంలో అయితే మహిళలు వింటర్ రాగానే మప్లర్ వేసుకునేవాళ్లు. కానీ ఇప్పుడది పాతదైపోయింది. ఇంకా అమ్మాయిలకు ఇష్టమయ్యే షావల్స్, స్కార్ఫ్‌లు. వేడెక్కించే హాట్ స్టయిల్ క్రాప్డ్ టాప్స్ అందుబాటులో ఉన్నాయి. 
 
చిన్న పిల్లలకు మిక్కీ మౌస్, టాపామ్ అండ్ జెర్రీ లాంటి షేప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వేసుకోవడానికి పిల్లలు కూడా ఉత్సాహం చూపుతారు. ఇక స్వెటర్లు ఉన్నాయి. మంకీ క్యాప్స్‌లోనూ కొత్త ప్యాటర్న్‌లు వచ్చాయి. చెవులను కూడా కప్పే విధంగా బీనీ హ్యాట్స్‌కు మంచి క్రేజ్ ఉంది. ఊలుతో అల్లినవే కాకుండా ఫర్, ఫెల్డ్, ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన హ్యాట్స్ లభ్యమవుతున్నాయి. వీటిని ధరిస్తూ చలికాలంలో అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.