శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 13 జనవరి 2016 (12:04 IST)

శీతాకాలంలో అరోమాథెరపీ.. మల్లెపూల వాసన ఘాటుగా, రొమాంటిక్‌గా?

కొన్ని పుష్పాల నుండి తయారు చేసే తైలాలు మంచి సువాసనను కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఔషధ లక్షణాలు కూడా ఉంటాయి. అవి మనసు, శరీరాన్ని ఆహ్లాదపరుస్తుంది. మూడ్స్‌లో మార్పును కలిగిస్తుంది. సువాసనల ఆధారంగా జరిపే ఈ చికిత్సను అరోమాథెరపీ అంటారు. పూర్వ కాలము నుండి పరిమళభరితమైన కొన్ని నూనెలను వైద్యపరంగా ఉపయోగించడం పరిపాటి. మెదడు, చర్మం, మొత్తంగా శరీరానికే స్వస్థత చేకూర్చే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతిగా అరోమాథెరపీని ఇప్పుడు అందరు ఆచరిస్తున్నారు.
 
వివిధ మొక్కల ఆకులు, బెరడు, పూలు, కాండం, వేర్లు ఇలా  ప్రతిభాగం నుంచీ సారాన్ని సేకరించే ఈ తైలాలను ''ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌'' అంటారు. అన్నింటిలోకీ ప్రాచుర్యం పొందినవి లావెండర్‌ ఆయిల్‌, లెమన్ ఆయిల్, కొకొనట్ ఆయిల్, జాస్మిన్ ఆయిల్.
 
సాధారణంగా మల్లెపూల వాసన ఎంత ఘాటుగా, ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. దీని నూనెను డిప్రెషన్‌ను తగ్గించేందుకు, మనస్సులో ఉత్తేజం కలిగించేందుకు వాడుతుంటారు. 
 
శీతాకాలంలో చర్మ సమస్యలకు, కండరాల నొప్పికి, చెక్ పెట్టాలంటే లావెండర్ దివ్యౌషదంగా పనిచేస్తుంది. దీనితో మసాజ్ చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. శారీరక బాధలు తగ్గుతాయి. శరీరంలో ఏ భాగంపైనా ఒత్తిడి కలుగకుండా చేసే మర్దనతో హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. 
 
కొబ్బరినూనె ప్రతిరోజూ వాడితే చర్మం చక్కటి తేమ కలిగి నిగనిగ లాడుతుందని చర్మ నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ చర్మానికి, జుట్టుకు పట్టిస్తే మహిళల సౌందర్యం రెట్టింపు అవటంలో కొబ్బరినూనె ఎంతో సహకరిస్తుందనటంలో సందేహం లేదు.
 
చర్మ సమస్యలకు, జీర్ణ సంబంధ సమస్యలకు నిమ్మనూనె ఎంతో ఉపయోగపడుతుంది. కొవ్వుని తగ్గించడంలో సహాయపడుతుంది. తలనొప్పులు, జ్వరానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు.