శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 11 మే 2017 (18:00 IST)

పుట్టబోయే బిడ్డ అబ్బాయా.. అమ్మాయా.. ఇలా తెలుసుకోవచ్చు

పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ వుంటుంది. అయితే తల్లి బీపీ ఆధారంగా పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనేది తెలుసుకోవచ్చు అంటున్నారు .. కెనడా వైద్యులు. గర్భం దాల్చడానికి ముందు తల్లి బ

పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ వుంటుంది. అయితే తల్లి బీపీ ఆధారంగా పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనేది తెలుసుకోవచ్చు అంటున్నారు .. కెనడా వైద్యులు. గర్భం దాల్చడానికి ముందు తల్లి బీపీ తక్కువగా ఉంటే అమ్మాయి పుడుతుందని.. అదే ఎక్కువగా బీపీ వుంటే అబ్బాయి పుడతాడని అని కెనడా వైద్యులు చెప్తున్నారు. 
 
నిజానికి మహిళ గర్భం ధరించేందుకు ముందు తల్లి బీపీ గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరు. కానీ రెండింటికీ సంబంధం ఉందని అధ్యయనంలో తేలినట్లు కెనడా వైద్యులు చెప్తున్నారు. సుమారు మూడువేల మందిపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని వారు తెలిపారు. గర్భం దాల్చడానికి ముందు మహిళల బీపీ, కొలెస్ట్రాల్, చక్కెర శాతాలను పరిశీలిస్తూ వచ్చారు. వాళ్లలో బీపీ ఎక్కువగా ఉన్న వాళ్లందరికీ అబ్బాయిలు పుట్టారట. కాబట్టి తల్లి బీపీ అనేది పుట్టబోయే బిడ్డ ఆడా మగా అనేది నిర్ణయిస్తుందన్నమాట.