బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (10:30 IST)

అల్పాహారంలో పాలు, బాదం, మజ్జిగ ఉండేలా చూసుకోండి.. జుట్టును పెంచుకోండి

అల్పాహారం తీసుకోవడం ద్వారా కూడా జుట్టును పెంచుకోవచ్చు. ఉదయం పూట తీసుకునే అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం పూట అ

అల్పాహారం తీసుకోవడం ద్వారా కూడా జుట్టును పెంచుకోవచ్చు. ఉదయం పూట తీసుకునే అల్పాహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా చర్మానికి, జుట్టుకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం పూట అల్పాహారాన్ని మానితే అనారోగ్య సమస్యలు తప్పవ్. అల్పాహారంలో 40 శాతం ఆహారం వండాల్సిన అవసరం లేనిదై ఉండాలి. 
 
పండ్లూ, నానబెట్టిన గింజలూ, క్యారెట్‌ వంటివి తీసుకోవాలి. మొలకలూ, పాలూ, బాదం, మజ్జిగ, కొబ్బరి నీళ్లూ, పండ్ల రసాలు ఇవి జుట్టు పెరగడానికి తోడ్పడతాయి. బొప్పాయీ, గుడ్డులోని తెల్లసొన, పాలల్లో జుట్టు పెరగడానికి అవసరం అయిన బయోటిన్‌ అధికంగా ఉంటుంది. టీ, కాఫీల్లో పంచదార కంటే.. బెల్లం వాడితే మంచిది. 
 
ఆడవాళ్లలో 33 దాటితే.. ఇనుము, క్యాల్షియం, విటమిన్ల లోపం ఎక్కువగా ఉంటుంది. దాంతో జుట్టు వూడిపోతుంది. అందుకే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు, చేపలు తీసుకుంటే జుట్టుకు ఎంతో మేలు చేకూరుతుంది.