Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్పాహారంలో ఇడ్లీ.. కోడిగుడ్డు వుంటే మేలేంటో తెలుసా? (video)

మంగళవారం, 2 జనవరి 2018 (17:43 IST)

Widgets Magazine

అల్పాహారంలో కూరగాయలు, పండ్లు, ఫైబర్ కూడిన పదార్థాలు వుండాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కోడిగుడ్డు, గోధుమలతో చేసిన వంటకాలు, ఇడ్లీలు అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతాం.

పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, యువత, మహిళలు, పొద్దున్నే అల్పాహారం తీసుకోవడంపై శ్రద్ధపెట్టరు. అయితే అల్పాహారం విషయంలో నిర్లక్ష్యంగా వుంటే అనారోగ్య సమస్యలు వెతుక్కుంటూ వస్తాయని.. అందుకే పోషకాలున్న ఆహార పదార్థాలను అల్పాహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇందులో భాగంగా రోజూ అల్పాహారంలో కోడిగుడ్డు వుండేలా చూసుకోవాలని వారు చెప్తున్నారు. మాంసకృత్తులూ, యాంటీఆక్సిడెంట్లు ఉండే గుడ్డును ఉడికించి తింటే, మెదడూ, కాలేయం ఆరోగ్యంగా ఉంటాయి. పైగా దానివల్ల కంటి సంబంధ సమస్యలు కూడా రావు. పొట్ట నిండినట్టు ఉంటుంది. ఎక్కవసేపు ఆకలి కూడా వేయదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయి.
 
అలాగే ఇడ్లీలను అల్పాహారంగా తీసుకుంటే.. బలవర్థకమే కాకుండా జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మాంసకృత్తులూ, అమినోయాసిడ్లూ, పిండిపదార్థాలు పుష్కలంగా వుంటాయి. పైగా కొలెస్ట్రాల్ సమస్య వుండదు. అయితే సాంబారు కాకుండా.. చట్నీతో తింటే మంచిది. గోధుమల్లో పీచు ఎక్కువగా వుంటుంది.

గోధుమ ఉప్మా లేకుంటే కూరగాయలతో కలిసి కిచిడీలా చేసుకుని తింటే జీర్ణాశయంలో అనవసరమైన వ్యర్థాలు తొలగిపోతాయి. ఇంకా అల్పాహారంలో బాదం పప్పులు, వాల్‌నట్స్ తీసుకుంటే శరీరానికి పీచు అందుతుంది. తద్వారా బరువు పెరగరని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 


Widgets Magazine

Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఎంత బాధ కలిగినా అబ్బాయిలు ఎందుకు ఏడవరో తెలుసా?

సాధారణంగా ఏదైనా బాధ, కష్టం వస్తే కన్నీరు పెట్టుకుంటారు. కొన్నిసార్లు వెక్కివెక్కి ...

news

భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగితే?

భోజన సమయంలో లేకుంటే భోజనం చేసిన వెంటనే నీరు తాగడం ద్వారా జీర్ణరసాలు పలుచబారుతాయి. తద్వారా ...

news

అల్లం నోటి దుర్వాసనను దూరం చేస్తుందట..

అల్లం రసానికి సమానంగా తేనె కలిపి ఓ టీస్పూన్ చొప్పున మూడు పూటలా సేవిస్తే దగ్గు, ఉబ్బసం, ...

news

నువ్వుండలు పిల్లలకు తినిపిస్తే ఏమౌతుంది?

నువ్వులు, బెల్లం కలిపి చేసిన నువ్వుండలు పిల్లలకు తినిపిస్తే శీతాకాలంలో జలుబు, దగ్గును ...

Widgets Magazine