శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (09:12 IST)

అల్పాహారమే మన కొంపముంచుతోంది.. బ్రేక్ ఫాస్ట్‌లో అధిక ఫాట్, కార్బొహైడ్రేట్లు ఉంటున్నాయా?

భారతీయులు అనారోగ్యానికి పాలవడానికి వారు తీసుకునే అల్పాహారమే ప్రధాన కారణమని తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా 2 లక్షల పట్టణాల్లో దాదాపు 10 లక్షల మంది ఆహారపు అలవాట్లపై హెల్తిఫైమీ అనే మొబైల్‌ హెల్త్‌

భారతీయులు అనారోగ్యానికి పాలవడానికి వారు తీసుకునే అల్పాహారమే ప్రధాన కారణమని తాజా అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా 2 లక్షల పట్టణాల్లో దాదాపు 10 లక్షల మంది ఆహారపు అలవాట్లపై హెల్తిఫైమీ అనే మొబైల్‌ హెల్త్‌, ఫిట్‌నెస్‌ సంస్థ అధ్యయనం చేసింది. భారత్‌లో ఉదయం, సాయంత్రం తీసుకుంటున్న అల్పాహారాల్లో అధిక కొవ్వులు, కార్బొహైడ్రేట్లు ఉంటున్నాయని తేలింది. వీటిని తీసుకోవడం ద్వారా బీపీ, మధుమేహం, స్థూలకాయం బారినపడే అవకాశాలున్నాయని తేలింది. 
 
సాధారణంగా ఉదయాన్నే తీసుకునే అల్పాహారమే రోజంతా ఉత్సాహంగా.. ఆరోగ్యకరంగా ఉండేందుకు ఉపకరిస్తుందని వైద్యులు చెప్తున్నారు. కానీ మనదేశ ప్రజలు మాత్రం ఉదయం తీసుకునే ఆహారంతో అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నట్లు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
అల్పాహారం తక్కువ మోతాదులో తిన్నప్పటికీ బ్రేక్‌ఫాస్ట్‌... అధిక కొవ్వులు, కార్బొహైడ్రేట్లు, కేలరీలతో కూడి ఉంటోందని పరిశోధనలో వెల్లడి అయ్యింది. దేశంలో స్థూలకాయులు ఎక్కువవ్వడానికి కూడా ఇదే కారణమని తాజా అధ్యయనంలో పరిశోధనకారులు తెలిపారు. 
 
కానీ ఉదయం పూట ఎక్కువ మోతాదులో తీసుకున్నా.. మధ్యాహ్నం, రాత్రి వేళ భోజనాలు మాత్రం మనం ఆరోగ్యానికి మేలు చేసేవిగా తీసుకుంటున్నామని తాజా అధ్యయనంలో వెల్లడి అయ్యింది. ఇందుకు కారణం భోజనంలో కూరగాయల శాతం అధికంగా ఉండడమే. అందులోనూ రాత్రి భోజనం మరింత ప్రొటీన్లతో కలిగి ఉంటోందని పేర్కొంది.