గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2016 (12:45 IST)

గుండెకు మేలు చేసే బ్రొకోలి డైట్‌

బ్రొకోలిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండెకు చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్‌ 6 శాతం మేరకు తగ్గుతుంది. ఈ విషయం ఇటీవల జరిపిన ఒక అధ్యయనంలో తెలుపబడింది. సహజ సిద్ధంగా లభించే మిశ్రమం గ్లూకోరఫనిన్‌ సాధారణ బ్రోకోలి రకంతో పోల్చితే కొత్త రకం బ్రోకోలి రెండు, మూడు రెట్లు ఎక్కువగా లభిస్తుంది. 
 
ఈ రకం ఇప్పటికే బెనెఫోర్ట్‌ పేరుతో బ్రిటిష్‌ సూపర్‌మార్కెట్లలో లభిస్తుంది గ్లూకోరఫనిన్‌ అధికంగా తీసుకున్న మనుషులపై జరిపిన రెండు వేరు వేరు పరిశోధనల్లో లోడెన్సిటీ లైపోప్రోటీన్‌ కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గింది అని పరిశోధకలు తెలిపారు. 
 
అధ్యయనంలో భాగంగా 130 వాలంటీర్లపై పరిశోధనలు నిర్వహించారు. ప్రతిరోజు వారి డైట్‌లో 400 గ్రాముల గ్లూకోరఫనిన్‌ బ్రకోలి ఇచ్చారు. 12 వారాల తర్వాత పరీక్షిస్తే వారి రక్తంలో ఎల్‌డీఎల్‌ కొలెస్ట్రాల్‌ 6 శాతం మేరకు తగ్గింది.