గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2017 (21:28 IST)

క్యాబేజీతో ప్రయోజనాలు తెలిస్తే వదలరు..

సాధారణంగా మనలో చాలామంది క్యాబేజిని తినేందుకు ఇష్టపడరు. అందులో నుంచి వచ్చే వాసన చాలామందికి ఇష్టం వుండదు. నిజానికి క్యాబేజీ వల్ల మనకు కలిగే లాభం ఎంతో వుంది. క్యాబేజీని మనం తినడం లేదంటే ఎన్నో పోషకాలను మనం కోల్పోతున్నామనుకోవాలి. క్యాబేజీని తినడం ఇష్టం ల

సాధారణంగా మనలో చాలామంది క్యాబేజిని తినేందుకు ఇష్టపడరు. అందులో నుంచి వచ్చే వాసన చాలామందికి  ఇష్టం వుండదు. నిజానికి క్యాబేజీ వల్ల మనకు కలిగే లాభం ఎంతో వుంది. క్యాబేజీని మనం తినడం లేదంటే ఎన్నో పోషకాలను మనం కోల్పోతున్నామనుకోవాలి. క్యాబేజీని తినడం ఇష్టం లేకపోతే కనీసం దానిని నీటిలో ఉడకపెట్టుకుని రోజూ ఆ నీటిని తాగితే చాలు.
 
క్యాబేజీ నీటిని రోజూ తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. విషజ్వరాలు, బాక్టీరియా, వైరస్‌‍ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. దృష్టి సమస్యలు పోతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి చూపు తగ్గిన వారు క్యాబేజీ నీటిని వాడితే చాలా మంచిది. అలాగే ఈ నీటిని తాగితే ముఖంపై ఉన్న మచ్చలు పోతాయి. 
 
క్యాబేజీలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు ఉండడంతో ఎముకలకు బలాన్నిస్తాయి. ఆల్కహాల్ సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది. లివర్ శుభ్రపరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. అల్సర్‌తో బాధపడేవారు ఈ నీరు వాడితే చాలా మంచిది. క్యాన్సర్‌తో బాధపడుతున్న వారు క్యాబేజీ వాడితే రక్తహీనత తొలగిపోతుంది. అలాగే క్రొవ్వు కరిగిపోతుంది.