శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (14:21 IST)

చికెన్ పకోడీల జోలికెళ్ళొద్దు.. వ్యర్థాలకు మసిపూసి.. మారేడు కాయ చేస్తున్నారు..

డాబాలు, సంగటి హోటళ్లు, ఫాస్ట్ పుడ్లు, రెస్టారెంట్లు ఎక్కడ చూసినా రుచితో కూడిన ఆహారం లభిస్తుంది. వీటికి అలవాటు పడి చాలామంది ఇంట్లో వంట చేయడం ఆపి.. ఫాస్ట్ ఫుడ్ ఇష్టానుసారం లాగించేస్తున్నారు. అయితే హోటల్

డాబాలు, సంగటి హోటళ్లు, ఫాస్ట్ పుడ్లు, రెస్టారెంట్లు ఎక్కడ చూసినా రుచితో కూడిన ఆహారం లభిస్తుంది. వీటికి అలవాటు పడి చాలామంది ఇంట్లో వంట చేయడం ఆపి.. ఫాస్ట్ ఫుడ్ ఇష్టానుసారం లాగించేస్తున్నారు. అయితే హోటల్ భోజనంలో ఉన్న వ్యర్థాలు, అశుభ్రత, అనారోగ్యాల గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు. పిల్లలకు కూడా ఫాస్ట్ ఫుడ్‌ను అలవాటు చేసేస్తున్నారు. తద్వారా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.

ఇప్పటికే హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కుళ్ళిన మాంసంతో బిర్యానీ చేస్తున్నారని.. ఆ హోటల్‌ను సీజ్ చేశారు. తాజాగా చికెన్ పకోడీలు ఆరోగ్యానికి మంచివి కావని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోడ్లపై అమ్మే చికెన్ పకోడీల్లో శుభ్రత ఏమాత్రం లేదని.. రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ కోర్టుల్లోనూ ఇదే తంతు కొనసాగుతుందని వారు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
తాజాగా కోళ్ల వ్యర్థాలతో చికెన్ పకోడీలు, షేర్వాలు తయారు చేస్తున్నారు. తద్వారా మాంసాహారులు అనారోగ్యానికి గురవుతున్నారు. మాంస ప్రియులను టార్గెట్ చేసి.. ఇలాంటి వ్యర్థాలతో తయారైన ఆహార పదార్థాలు అమ్ముతున్నా.. ఆహార భద్రతాధికారులు చోద్యం చూస్తున్నారు.

నాటుకోడుల కంటే బాయిలర్ కోడి మాంసాన్నే ప్రస్తుతం అనేక మంది ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కోడి పక్వానికి వచ్చేందుకు పలు రకాల ఇంజెక్షన్లు, ఆహారం పెడుతుంటారు. వీటి ప్రభావం కోడి చర్మంపై ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది స్కిన్ లెస్ కోడి మాంసం తీసుకుంటారు.  
 
కానీ ప్రజలు వినియోగించని కోడి వ్యర్థాలను, చర్మాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. కోడిని అమ్మగా మిగిలిపోయిన వ్యర్థాలు, కోడి చర్మం, కాళ్లను ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు తక్కువ ధరకే తీసుకెళ్లి.. చికెన్ పకోడీల రూపంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఇవి వ్యర్థాలని తెలియకుండా మొక్కజొన్న పిండి.. మసాలాలు దట్టంగా పట్టించి.. వేయించిన నూనెలోనే మళ్లీ వేయించి అమ్మేస్తున్నారు. వీటిని మాంసాహారులు లొట్టలేసుకుని మరీ తినేస్తున్నారు.

ఇలా వ్యర్థాలను తినడం ద్వారా అలర్జీ, అల్సర్, గ్యాస్ ట్రబుల్ వంటి అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత హోటల్ ఫుడ్‌కు పూర్తిగా స్వస్తి చెప్పి.. మాంసాహారం తినాలనుకుంటే ఇంట్లో వండిన వంటకాలకే ప్రాధాన్యమిస్తే లేనిపోని ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు.