శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 12 జనవరి 2016 (14:44 IST)

కొబ్బరిలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలేంటి?

ప్రజలు ఎక్కువగా త్రాగే పానీయాల్లో కొబ్బరి ఒకటి. అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. ప్రకృతి సిద్ధంగా కొబ్బరిలో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కొబ్బరికాయే కాదు కొబ్బరిబొండాంలో లభించే నీరు కూడా ఎంతగానో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇపుడు ఇలాంటి కొబ్బరి నీళ్లు, పాలు, నూనె, దాని గుజ్జు వల్ల కలిగే లాభాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
 
ప్రోటీన్ల లోపం ఉన్నవారికి కొబ్బరి పాలు దివ్యౌషధంలా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లలో కాస్త పసుపు, గంధం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతులీనుతుంది. పిల్లలకు కూల్‌డ్రింక్‌లకు బదులుగా కొబ్బరి నీళ్లు తరచూ ఇస్తే బలం చేకూరుతుంది. కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసుకుంటే శిరోజాలకే కాదు, కళ్లకు కూడా మేలు చేకూరుతుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
 
కొబ్బరి నీళ్లలో సోడియం తక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని తాగితే అతిసారం, గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి. 
స్నానం చేసే ముందు శరీరానికి కొబ్బరి నూనెతో బాగా మర్దనా చేసుకోవాలి. కొలెస్ట్రాల్ శాతం తక్కువగా ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే కొవ్వు సమస్య ఉండదు. తరచూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. లేత కొబ్బరి గుజ్జును రాసుకుంటే ముఖభాగంపై మొటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.