బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (12:05 IST)

కొబ్బరి నీటితో నిమ్మరసం కలుపుకుని తాగితే ప్రయోజనాలేంటి?

కొబ్బరి నీరు సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన నీరు. ఇది మందుల యొక్క దుష్ప్రభావలను అరికడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియకు ఎంతగానో దోహదపడుతుంది. పైపెచ్చు.. రుచికరమైన పానీయం. ఇది చిన్న పిల్లలకు పూర్తి

కొబ్బరి నీరు సహజ సిద్ధంగా లభించే ఖనిజ లవణాలు కలిగిన నీరు. ఇది మందుల యొక్క దుష్ప్రభావలను అరికడుతుంది. ముఖ్యంగా జీర్ణక్రియకు ఎంతగానో దోహదపడుతుంది. పైపెచ్చు.. రుచికరమైన పానీయం. ఇది చిన్న పిల్లలకు పూర్తి సురక్షితమైన పానీయంగా చెప్పుకోవచ్చు. 
 
ఈ నీటితో పాటు.. తేనె కలిపి తీసుకున్నట్టయితే సమర్థవంతమైన టానిక్‌గా పని చేస్తుంది. డీహైడ్రేషన్‌కు గురైన వారు ఎక్కువగా కొబ్బరి నీరు లేదా నిమ్మరసం తీసుకుంటే ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. అంతేకాకుండా, కడుపులో ప్రేగు నుంచి హానికరమైన బాక్టీరియాలను కూడా తొలగిస్తుంది. 
 
కొబ్బరి నీటిలో పొటాషియం, క్లోరిన్ తగినంత మోతాదులో ఉంది. ఇది అపరిమిత సంఖ్యలో ఉండే అల్బుమిన్, టైఫాయిడ్, మూత్రపిండ సంబంధిత వ్యాధులు, మూత్ర విసర్జనలోని లోపాలు, కిడ్నీలోని రాళ్ళు వంటి వాటికి ప్రత్యేకంగా సహాయపడుతుంది. 
 
వాంతుల దశలో ఉన్న పిల్లలు, గర్భణి మహిళలు, నిమ్మరసంతో కొబ్బరి నీరు ఇవ్వాలి. అజీర్తిని, అస్తమా, కడుపులో పుండు, నల్లటి మచ్చలు, మొటిమలను కూడా తొలగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.