శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 20 జూన్ 2018 (16:53 IST)

ఒబిసిటీకి చెక్ పెట్టే సూపర్ జ్యూస్.. ఏంటది?

కొత్తిమీర రసం, అల్లం రసం సమపాళ్లలో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. కొత్తిమీర జ్యూస్‌ను రోజూ అరగ్లాసు మేర తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది. ఇందులోని ప్రోటీన్లు, మినరల్స్, కార్బొహైడ్రేడ్లు, పీచు ఆరోగ్

కొత్తిమీర రసం, అల్లం రసం సమపాళ్లలో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. కొత్తిమీర జ్యూస్‌ను రోజూ అరగ్లాసు మేర తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది. ఇందులోని ప్రోటీన్లు, మినరల్స్, కార్బొహైడ్రేడ్లు, పీచు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యానికి, సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. అలాగే కొత్తిమీరలో వొలాటైన్ ఆయిల్ కడుపునొప్పి, తలనొప్పి, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
 
ఎముకలు బలంగా ఉంచే విటమిన్ ''కె'' ఇందులో పుష్కలంగా వుంటుంది. కొత్తిమీరలోని యాంటీ  ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. హైకొలెస్ట్రాల్‌ను తగ్గిసాయి. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిని పెంచుతుంది.
 
కొత్తిమీర ఆకులు హైబీపీని నియంత్రిస్తాయి. ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌లను కలిగి వుండే కొత్తిమీర ఆకులు కంటి చూపును మెరుగుపరుస్తాయి. రోజూ రాత్రి నిద్రించేందుకు ముందు.. అల్లం చిన్నముక్క, కీరదోస, కొత్తిమీర, పుదీనా సమపాళ్లలో తీసుకుని.. మిక్సీలో గ్రైండ్ చేసుకుని నాలుగైదు చుక్కలు నిమ్మరసం కలిపి తీసుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.