గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2017 (12:10 IST)

బరువు తగ్గాలంటే ఆవు పాలే తాగండి... గేదె పాలు తాగితే..?

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆవుపాలు తీసుకోండి. ఇందులో ఫ్యాట్ తక్కువగా వుంటుంది. తేలికగా జీర్ణమవుతుంది. అందుకే చిన్నారులకు ఆవు పాలను ఇస్తారు. ఆవు పాల‌లో నీరు ఎక్కువ‌గా ఉంటుంది. 90 శాతం నీటిని ఆవు పాలు క

బరువు తగ్గాలనుకుంటున్నారా? ఆవుపాలు తీసుకోండి. ఇందులో ఫ్యాట్ తక్కువగా వుంటుంది. తేలికగా జీర్ణమవుతుంది. అందుకే చిన్నారులకు ఆవు పాలను ఇస్తారు. ఆవు పాల‌లో నీరు ఎక్కువ‌గా ఉంటుంది. 90 శాతం నీటిని ఆవు పాలు క‌లిగి వుండటంతో తక్కువ క్యాల‌రీలు మనకు లభిస్తాయి. ఆవు పాల‌లో కాల్షియం, పాస్ఫ‌ర‌స్‌, మెగ్నిషియం, పొటాషియం వంటి పోష‌కాలుంటాయి. 
 
తెల్ల ఆవుపాలు వాతాన్ని నల్ల కపిల ఆవు పాలు పిత్తాన్ని, ఎరుపు రంగు ఆవుపాలు కఫాన్ని హరించివేస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఆవుపాలు సర్వరోగ నివారిణి మాత్రమే కాదు. అవి వృద్ధాప్యాన్ని కూడా దూరంగా ఉంచుతాయి. ఆవు పాలు తీసుకుంటే కంటి దృష్టి సమస్యలు వుండవు. ఆవు పాలతో బుద్ధి బలాన్నిస్తుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. 
 
అయితే ఈ పోషకాలు గేదె పాలలో ఎక్కువగా వుంటాయి. వీటిలో కొవ్వు శాతం కూడా ఎక్కువే. గేదె పాల‌ను ఎక్కువ‌గా ప‌న్నీర్‌, పెరుగు, నెయ్యి త‌యారీలో వాడుతారు. గేదె పాల‌ను ఎన్ని రోజులైనా నిల్వ ఉంచవ‌చ్చు. గేదె పాల‌లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. కొవ్వు కూడా ఎక్కువే. 
 
అందుకే అధిక బ‌రువు ఉన్న‌వారు ఆవు పాల‌ను తాగ‌డం మంచిదని.. బక్క పలచగా ఉన్న‌వారు, జీర్ణ శ‌క్తి అధికంగా ఉన్న‌వారు నిక్షేపంగా గేదె పాలు తాగ‌వ‌చ్చు. వ్యాయామం రోజూ చేసేవారు కూడా గేదె పాల‌ను తాగ‌వ‌చ్చు. జీర్ణశక్తి సమస్యలు ఎదుర్కొనేవారు గేదె పాలను తాగకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.