ఒత్తిడి అధికమైతే.. రోజూ మధ్యాహ్న భోజనంలో ఒక కప్పు పెరుగు తీసుకోండి

శనివారం, 1 జులై 2017 (12:12 IST)

పనిలో ఒత్తిడి అధికమైందా? ఆందోళన వేధిస్తుందా? అయితే వెంటనే ఓ కప్పు పెరుగును రోజువారీ డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది. పెరుగును రోజు ఒకకప్పు తీసుకుంటే ఒత్తిడి మాయమవుతుందని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు. మానసిక ఆందోళనను తగ్గించే గుణం పెరుగులో ఉందని పరిశోధనలో తేలింది.

పెరుగు తింటే డిప్రెషన్ తగ్గిపోతుందట. ఇందులో ఎక్కువగా ఉండే లాక్టోబాసిల్లిస్‌ అనే బ్యాక్టీరియా ఒత్తిడిని, డిప్రెషన్‌ను తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పెరుగులో ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. 
 
బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు దివ్యౌషధం లాంటిది. రాత్రి పూట అన్నంలో పెరుగును చేర్చి.. ఉదయం కొత్తిమీర, ఉల్లిపాయ కలిపి తినడం వల్ల బక్కపలచగా ఉన్న వారు పుష్టిగా తయారవుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది.  అంతేకాదు శరీరానికి కాంతినిస్తుంది. ఇక గర్భిణులకు చాలా మంచిది. కానీ అధికంగా తీసుకుంటే వాతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే రోజుకో కప్పు చొప్పున పెరుగును మధ్యాహ్నం పూట భోజనంలో చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వారు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  
Pressure Coriander Onion Stress Relife Curd Health Benefits

Loading comments ...

ఆరోగ్యం

news

కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడుతాయి? జాగ్రత్తలేమిటి?

కిడ్నీలో రాళ్లకు కారణం కొన్ని ఆహార పదార్థాలే. పాలు, పాలకూర, సోయాబీన్స్, చాక్లెట్లు వంటివి ...

news

రోజుకు ఓ కప్పు కొబ్బరి పాలు తీసుకుంటే...?

దక్షిణ భారతదేశంలోని కేరళ వంటి రాష్ట్రాల్లో కొబ్బరి నూనెను ఎక్కువగా వంటకాల్లో ...

news

భార్యాభర్తలు శారీరక సుఖానికి దూరమైతే...

భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య జరిగే శారీరక సంబంధం (శృంగారం) అనేది తాత్కాలిక ...

news

మతిమరుపుకు దివ్యౌషధంగా పనిచేసే కాఫీ

వృద్ధాప్యంతో సంబంధం లేకుండా చాలామందిని భయపెడుతున్న సమస్య మతిమరుపు. అలాంటి మతిమరుపుకు కాఫీ ...