శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 22 మే 2017 (10:38 IST)

పొట్ట నిండే వరకు తినొద్దు? మితంగా తినండి లేకుంటే?

కంచం ముందు కూర్చుంటే కొందరు కడుపు నిండిపోయే వరకూ ఏమాత్రం ఆగలేరు. పొట్ట నిండే వరకు తినాలి. కానీ భోజనం మొత్తం ముగించిన తర్వాత కూడా కడుపులో మరో నాలుగైదు ముద్దలకు చోటుండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

కంచం ముందు కూర్చుంటే కొందరు కడుపు నిండిపోయే వరకూ ఏమాత్రం ఆగలేరు. పొట్ట నిండే వరకు తినాలి. కానీ భోజనం మొత్తం ముగించిన తర్వాత కూడా కడుపులో మరో నాలుగైదు ముద్దలకు చోటుండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కడుపు నిండా కాకుండా.. నాలుగు ముద్దలు తక్కువ తినేవారి ఆయుర్దాయం ఎక్కువగా ఉంటోందని తాజా అధ్యయనంలో తేలింది. 
 
ఇలా మితంగా ఆహారం తీసుకోవడం ద్వారా జీవిత చరమాంకంలో అంటే వృద్ధాప్యంలో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. స్వీట్లు, కొవ్వు, తీపి పదార్ధాల వంటి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్ధాలు బాగా తగ్గించేసి.. చిన్నతనం నుంచీ పీచుతో సహా చక్కటి పోషకాలుండే పండ్లు, కూరగాయల వంటివి మితంగా తీసుకుంటుండేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నారనీ పరిశోధనలో తేలింది. 
 
ముఖ్యంగా వీరిలో మతిమరుపు, మధుమేహం, క్యాన్సర్ల వంటి జబ్బులు చాలా తక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. కాబట్టి తిండి మానేయకూడదు. అలాగని ఎక్కువగానూ తీసుకోకూడదు. మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.