గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 5 డిశెంబరు 2016 (16:23 IST)

ఖర్జూరాలు తినండి ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోండి.. కొలెస్ట్రాల్ తగ్గించుకోండి..

ఖర్జూరాలతో తయారుకున్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌ల

ఖర్జూరాలతో తయారుకున్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఖర్జూరాలలో అధిక మోతాదులో కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఈ పండ్లను తినడం వల్ల ఇన్ఫెక్షన్‌లను తట్టుకునే వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. రక్తస్రావాన్ని అరికడతాయి. శరీరానికి చక్కని శక్తిని అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి, గుండెజబ్బులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఖర్జూరాల నుండి తీసిన గుజ్జును తీసుకుంటే జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతుంది. కిడ్నీలోని రాళ్ళను కరిగించగల శక్తి ఖర్జూరానికి ఉంది. యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది. ఖర్జూరాలు రక్తపోటును తగ్గిస్తాయి. ఎముకలలో పటుత్వాన్ని పెంచుతాయి. ఉదర సంబంధమైన వ్యాధులను అరికడుతాయి. గర్భిణీలు ప్రసవానికి ముందు కనీసం నాలుగు వారాల నుండి రోజుకు నాలుగు ఖర్జూరాలను తింటే ప్రసవం సులభమవుతుంది. 
 
రక్తహీనత సమస్యను అరికడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ఎండాకాలంలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి తప్పించుకోవచ్చు.