మోతాదుకు మించి మంచి నీరు తాగితే కోమాలోకి వెళతారా?

శనివారం, 8 అక్టోబరు 2016 (13:48 IST)

drinking water

సాధారణంగా ప్రతి వ్యక్తి ప్రతి రోజూ ఎన్ని నీళ్లు తాగితే అంత మంచిది. కానీ, నీళ్లు మరీ ఎక్కువ తాగినా కూడా ప్రమాదమేనని తాజాగా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మనిషి శరీరంలో అసలు ఎన్ని నీళ్లు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ ఉంటుందని, ఎక్కువ నీళ్లు తాగకుండా అదే ఆపుతుందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెపుతున్నారు.
 
అయినా పట్టించుకోకుండా ఎక్కువ నీళ్లు తాగితే 'హైపోనెట్రేమియా' అనే సమస్య వస్తుందంటున్నారు. దానివల్ల రక్తంలోని సోడియం గణనీయంగా పడిపోతుందన్నది వారి అభిప్రాయంగా ఉంది. దానివల్ల వాంతులు, వికారంతో మొదలుపెట్టి ఒక్కోసారి ఏకంగా మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. నీళ్లు మరీ ఎక్కువ తాగినపుడు మనిషి మెదడు కూడా స్పందించి ఆ విషయాన్ని తెలియజేస్తుందట.
 
మన శరీరానికి ఎంత కావాలో అంతే నీళ్లు తాగితే పర్వాలేదని, కేవలం దాహం వేసినప్పుడే తాగాలి తప్ప.. కావాలని నీళ్లు ఎక్కువగా తాగకూడదని పరిశోధనకు నేతృత్వం వహించిన అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్‌ ఫారెల్ తెలిపారు. ఇందుకోసం కొంతమందిని తీసుకున్న ఈ బృందం వారిలో సగం మందిని సరిగ్గా దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగాలని చెప్పి, మిగిలిన సగం మందిని మాత్రం ఎక్కువ నీళ్లు తాగమని చెప్పారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కమలా పళ్లు వచ్చేశాయ్... ఈ పండ్లు తింటే ఉపయోగాలేంటో తెలుసా...?!

సిట్రస్‌ జాతికి చెందిన కమలాఫలం, నారింజ, బత్తాయి, నిమ్మ వంటి ఏ ఫలాన్ని అయినా సరే వాడితే ...

news

జ్యూసర్లు వాడే బ్లేడుతో పండ్లలోని పోషకాలు మటాష్.. ఫ్రెష్ జ్యూసులొద్దు.. పండ్లే ముద్దు..

పండ్లను నేరుగా అలానే వొలిచి తీసుకోవడం ద్వారానే శరీరానికి కావాలసిన పోషకాలు అందుతాయని ...

news

కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచే బీన్స్..

చాలా మంది అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటారు. దీంతో గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ...

news

అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా.. అయితే, బీట్ రూట్ రసాన్ని తాగండి..

మారుతున్న టెక్నాలజీతో పాటు వ్యక్తిగత ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో అనేక మంది ...