శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (14:33 IST)

ఆరోగ్యానికి రక్షణ కవచం ‘రాగి’... రాగి చెంబులో నీళ్లు తాగితే...

రాత్రి పూట రాగి చెంబులో నీళ్ళు నిలువ చేసి పరకడుపున త్రాగడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మెదడు శక్తివంతంగా తయారవుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు క్రమపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రాగి ప

రాత్రి పూట రాగి చెంబులో నీళ్ళు నిలువ చేసి పరకడుపున త్రాగడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మెదడు శక్తివంతంగా తయారవుతుంది. థైరాయిడ్ గ్రంధి పనితీరు క్రమపడుతుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రాగి పాత్రలను నిత్యం ఉపయోగంచడం వల్ల ఎముకల పటుత్వం పెరుగుతుంది. ఎముకలు దృఢంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి. రాగి పాత్రలలో వండిన వంటలను సేవించడం ద్వారా కాలేయం, మూత్రపిండాలు ఆరోగ్యవంతంగా పని చేస్తాయి.
 
చిన్న వయసులో జుట్టు తెల్లబడటం, చర్మం త్వరగా ముడతలు పడటం, వయస్సు పెరిగినట్లు కనిపించడం వంటి సమస్యలు దరిచేరకుండా నియంత్రిస్తాయి. ఊబకాయం, మలబద్దకం, గుండెపోటు వంటి సమస్యలకు మంచి ఔషదంగా పనిచేస్తుంది. రాగి కడియం ధరించడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి బి.పి, కొలెస్ట్రాల్‌ను అరికడుతుంది.
 
రాగి బిందెలలో నీళ్ళు నిలువ చేసుకుని తాగడం వల్ల శరీరం బరువును పెంచే అనవసరమైన కొవ్వును బయటకు పంపేస్తుంది. రక్తప్రసరణను క్రమబద్దీకరించి మెదడును చురుకుగా పనిచేసేలా చేసి జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తుంది. ఎదిగే పిల్లలకు అది ఎంతో ఉపకరిస్తుంది.