శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 27 జనవరి 2016 (10:17 IST)

ప్రతి రోజూ ఒక కమలా పండు తినండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

ఆరెంజ్ పండును చూడగానే తినేయాలని... జ్యూస్ తాగేయాలని అనిపిస్తుంది. నారింజ పండ్లు చలికాలంలో ఎక్కువగా దొరుకుతుంటాయి. ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలు నారింజలో చాలావరకకు ఇమిడిపోయాయి. పుల్ల పుల్లగా తీయ్యటి రుచితో నోరూరిస్తుంది నారింజ. వీటి సీజన్ వచ్చిందంటే ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. నారింజ పండును తింటే వచ్చే ప్రయోజనాలు అన్నిఇన్నీ కావు. రోజూ నారింజపళ్ళను తినడం వలన ఆరోగ్యం, అందం లభిస్తుంది. పీచు పదార్థమైన కమలా పండులో సి విటమిన్  అధికంగా ఉంటుంది.
 
ఈ సి విటమిన్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పక్షవాతం, గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. ఈ సి విటమిన్ వలన శరీరంలోని ఎముకలు గట్టిపడతాయి. చర్మ సౌందర్యం పెరుగుతుంది. తిన్న ఆహారం ఎంతో సులువుగా జీర్ణం అవుతుంది. నారింజపండు తింటే మలబద్దకం సమస్య ఉండదు. నారింజపండు ఊపిరితిత్తులు, కడుపు, పేగులలోని కాన్సెర్ రాకుండా కాపాడుతుంది. ఆకలిని బాగా పుట్టిస్తుంది. 
రక్తపోటులోని హెచ్చు తగ్గులను సరిచేస్తుంది. అంతేకాకుండా గుండె సరిగా పనిచేయడానికి కావలసిన పొటాషియం, మెగ్నీషియంలు నారింజలో పుష్కలంగా లభ్యమవుతాయి. శరీరంలోని మలినాలను శుద్ధి చేసి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుందని వైద్యనిపుణులు అంటున్నారు. రోజూ ఒక కమలా పండు తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.