శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2016 (11:27 IST)

మాంసాహారం.. చీజ్.. ఫాస్ట్ ఫుడ్‌లకంటే.. సీఫుడ్‌లో కొవ్వు తక్కువ..

సీఫుడ్ తీసుకుంటే గుండెపోటు చాలామటుకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు సీ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చునని లండన్ పరిశోధకులు

సీఫుడ్ తీసుకుంటే గుండెపోటు చాలామటుకు తగ్గుతుందని తాజా అధ్యయనంలో తేలింది. వారానికి ఒకసారి లేదా రెండుసార్లు సీ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండె సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చునని లండన్ పరిశోధకులు అంటున్నారు.

రొయ్యలు, పీతలు, స్క్విడ్, ఆక్టోపస్‌లలో విటమిన్స్, మినరల్స్ మెండుగా ఉన్నాయని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. సల్మోన్ అనే సముద్ర చేప నుంచి వచ్చే చేపనూనె గుండెపోటును నియంత్రిస్తుంది. సముద్రపు ఆహారంలో కీలక ఫ్యాటీ యాసిడ్ ఉందని ఇది.. గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుందని ఎన్‌హెచ్ఎస్ తెలిపింది. 
 
సముద్రపు ఆహారంలో కొవ్వు శాతం ఇతర మాంసాహారంతో పాటు చీజ్, ఫాస్ట్‌ఫుడ్‌లకంటే తక్కువగా ఉంటుంది. ఇంకా రక్తంలోని కొవ్వు శాతాన్ని నియంత్రించడంలో సముద్రపు ఆహారం తీసుకోవడం ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, గర్భధారణ సమయంలో ముడి షెల్ల్ఫిష్, రా సీ ఫుడ్‌ను తీసుకోకూడదని పరిశోదకులు అంటున్నారు.