శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 23 ఆగస్టు 2018 (12:37 IST)

పొట్ట తగ్గాలంటే మాంసాహారం బాగా తగ్గించాలి

పొట్ట తగ్గాలంటే గ్లాసుడు గోరువెచ్చని నీటిని నిమ్మరసంతో పాటు కాస్త ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగాలి. ఇలాచేస్తే శ‌రీరంలో మెట‌బాలిజం రేటు పెరిగి, పొట్ట‌లో పేరుకున్న కొవ్వు క్ర‌మంగా త‌గ్గుతుంది. శ‌రీరంలోని

పొట్ట తగ్గాలంటే గ్లాసుడు గోరువెచ్చని నీటిని నిమ్మరసంతో పాటు కాస్త ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగాలి. ఇలాచేస్తే శ‌రీరంలో మెట‌బాలిజం రేటు పెరిగి, పొట్ట‌లో పేరుకున్న కొవ్వు క్ర‌మంగా త‌గ్గుతుంది. శ‌రీరంలోని విష‌ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. పొట్ట తగ్గాలంటే.. ముడిబియ్యం, రాగులు, జొన్నలు, సజ్జలు ఆరోగ్యంలో చేర్చుకోవాలి. 
 
తీపి ప‌దార్థాలు, స్వీట్ డ్రింక్స్‌కి పూర్తిగా దూరంగా ఉండాలి. నూనెను మోతాదుకి మించి వాడకూడదు. రెండు లేదా మూడు ప‌చ్చి వెల్లుల్లి రెబ్బ‌ల‌ను ఉద‌యాన్నే తీసుకుని ఆ త‌రువాత నిమ్మ‌ర‌సం తాగ‌డం వ‌ల‌న మ‌రింత మంచి ఫ‌లితం ఉంటుంది. ఇది శ‌రీరంలో ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌జావుగా జరిగేట్లు చూస్తుంది. 
 
పొట్ట తగ్గాలంటే.. మాంసాహారం బాగా తగ్గించాలి. రోజూ ఉద‌యం, సాయంత్రం క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌ండ్లు తీసుకోవాలి. దీంతో శ‌రీరానికి యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్లు, ఖ‌నిజాలు స‌మ‌కూరుతాయి. ఎసిడిటి లాంటి స‌మ‌స్య‌లు లేక‌పోతే వంట‌ల్లో మ‌సాలా దినుసుల‌ను ఎక్కువ‌గా వాడండి. 
 
దాల్చిన చెక్క‌, అల్లం, మిరియాలు వీటన్నింటిలో శ‌రీరానికి మేలు చేసే అంశాలు చాలా ఉన్నాయి. ఇవి శ‌రీరం ఇన్సులిన్‌ని ఉప‌యోగించుకునేలా చేసి, ర‌క్తంలో చక్కెర స్థాయుల్ని తగ్గిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.