శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 5 మే 2016 (09:26 IST)

స్టీమ్ థెరఫీతో కంటికురుపు చెక్... ఎలా?

చాలా మందికి వేసవి కాలంలో వేడి వల్ల కంటి కురుపులు వస్తుంటాయి. ది బ్యాక్టీరియా చేరడం వల్లగానీ, కనురెప్పల మీదనున్న తైల గ్రంధినాళం మూతపడటం వల్లగానీ జరుగుతుంది. ఇవి ఎంతో బాధకు గురి చేస్తుంటాయి. దీనికి స్టీమ్ థెరఫీతో చెక్ పెట్టొచ్చు. 
 
ఈ కంటి కురుపుకు వేడి చేసిన గుడ్డను కాపడం పెట్టాలి. రోజుకు నాలుగైదు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే, ఒక చెంచా ధనియాలు ఒక కప్పు నీటిలో మరిగించి, చల్లార్చిన తర్వాత ఆ కషాయంతో కంటిని రోజులో నాలుగైదుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి. జామ ఆకును వేడి చేసి ఆ వేడి ఆకును గుడ్డలో ఉంచి దానితో ఆ కురుపుకు కాపడం పెట్టాలి. లవంగం ఒకటి నీటిలో చిదిపి ఆ ముద్దను కంటి కురుపు మీద పెట్టాలి.