శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 19 జనవరి 2016 (11:10 IST)

స్పృహ తప్పి పడిపోతే ఏం చేయాలి.. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడమెలా?

తాత్కాలికంగా స్పృహ తప్పి పడిపోవడం ఏ వయస్సు వారికైనా, ఎప్పుడైనా జరగడం సహజం. మెదడుకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది. ఉదాహరణకు హఠాత్తుగా ఏదైనా వినకూడని వార్త విన్నప్పుడు, చాలా సేపు కదలకుండా నిలబడి ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. స్పృహ తప్పిపోవడమనేది చాలా సార్లు తాత్కాలికంగానే జరుగుతుంది. కొద్ది నిముషాలలోనే స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి తిరికి మామూలు స్థితికి వస్తాడు. అయితే స్పృహ తప్పి పడిపోవడానికి ముందు కొన్నిసూచనలు అంతేకాకుండా వారికోసం తీసుకోవలసిన జాగ్రత్తలేంటో చూద్దాం!
 
ముందు సూచనలు :
కళ్లు తిరుగుతున్నాయని, కళ్ళ ముందు చుక్కలు కనిపిస్తున్నాయని, కడుపులో తిప్పుతున్నట్లుగా ఉందని అనిపించినపుడు, చెమటలు పోస్తున్నప్పుడు, తలనొప్పితీవ్రమైనప్పుడు ఆ వ్యక్తి స్పృహ తప్పిపడిపోతున్నాడని అర్థం చేసుకోవచ్చు.
 
స్పృహ తప్పినప్పుడు ఏం చేయాలి?
స్పృహ తప్పి పడిపోతున్న వ్యక్తిని పడిపోకుండా పట్టుకోవాలి. స్పృహ తప్పిన వక్తి దుస్తులు బిగుతుగా ఉంటే కొంచెం వదులుగా చేయాలి. 
మెత్తటి వస్త్రాన్ని నీటితో ముంచి నుదిటిపై వేయాలి. శ్వాసను సులువుగా పీల్చుకుంటున్నారో లేదో పరిశీలించాలి. 
 
ఒక వేళ కింద పడినట్టయితే తలకి దెబ్బ గాయాలేమైనా తగిలాయా లేదా అని చూడాలి. 4 లేదా 5 నిముషాలు గడిచిన అతడు స్పృహలోకి రాలేదంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఇలాంటి చిట్కాలు పాటించినట్టయితే అపస్మారకస్థితిలోకి జారుకున్న వ్యక్తిని ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు.