మానసిక ఆరోగ్యానికి చేపలు తినాల్సిందే.. బొజ్జ తగ్గాలంటే?

మానసిక ఆరోగ్యానికి చేపలు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మానసిక ఒత్తిడిని పోగొడుతాయి. అలాగే చేపల్లో వుండే విటమిన్ డి,

selvi| Last Updated: బుధవారం, 10 జనవరి 2018 (17:55 IST)
మానసిక ఆరోగ్యానికి చేపలు తినాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మానసిక ఒత్తిడిని పోగొడుతాయి. అలాగే చేపల్లో వుండే విటమిన్ డి, ప్రోటీన్లు ఎక్కువగా వున్నందున మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

చేపలను తింటే వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్, దెమెంతియా వంటి వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. అంతేనా చేపలను రెగ్యులర్‌గా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. గుండె సమస్యలు ఉన్నవారు తరచూ చేపలను తీసుకుంటే మంచిది. చేపలను తరచూ తినేవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

మాంసం కన్నా చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బొజ్జ పెరగటం, రక్తపోటు పెరగకుండా చేయడం.. గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు చేపలు దోహదం చేస్తాయి.

చేపలు తినే అలవాటున్న వారిలో క్యాన్సర్ కారకాలు నశిస్తాయి. చేపలను తింటే గుండెజబ్బు, పెద్దపేగు క్యాన్సర్‌ వంటి వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చునని పోషకాహార నిపుణులు అంటున్నారు. కానీ ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :