శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (17:30 IST)

పరగడుపున ఈ ఆహారాలు తీసుకుంటే శరీరానికి ముప్పే...

సాధారణంగా ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు. అంతేకాదు... ఒక్కరోజు ఈ కాఫీ, టీ మిస్సయిందంటే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. కాని కాఫీ, టీలతో మైండ్ ఫ్రెష్ అవుతుంది అనుకుంటున్న వారికి త

సాధారణంగా ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలామందికి ఉన్న అలవాటు. అంతేకాదు... ఒక్కరోజు ఈ కాఫీ, టీ మిస్సయిందంటే ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. కానీ కాఫీ, టీలతో మైండ్‌ఫ్రెష్ అవుతుంది అనుకుంటున్న వారికి తెలియని నిజం ఏంటంటే…పరగడపున తాగే ఈ టీ, కాఫీల వల్ల వారి హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి…తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారట. కాఫీ, టీలే కాదు పరగడుపున కొన్ని ఆహారపదార్థాలు తీసుకుంటే శరీరానికి హాని కలుగుతుందట. అవేంటో ఇప్పుడు చూద్దాం...
 
పరగడుపున స్పైసీ ఫుడ్స్ తీసుకుంటే అల్సర్ రావడానికి ప్రమాదముందట.
 
ఉదయం లేవగానే... సోడా, కూల్‌డ్రింక్స్‌ను తాగడం వల్ల పేగుల్లో మంట కలిగి వాంతులు, వికారం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు.
 
పరగడుపున టమోటాలు తింటే వాటిలో ఉండే యాసిడ్స్ ఖాళీ కడుపులో చేరి వికారం కలిగించడమే కాకుండా పేగుల్లో మంట పుట్టిస్తుంది.
 
పరగడపున అరటిపండ్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మెగ్నీషియం స్థాయిని అమాంతం పెరగుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం.