వర్షాకాలంలో వేడివేడి బజ్జీలొద్దు.. నెయ్యిని పక్కనబెట్టేయాల్సిందే..

వర్షాకాలంలో దాహం వేయదు. చెమట పట్టదు. వ్యాయామం చేయాలనిపించదు. శారీరక శ్రమ అంతగా వుండదు. ఇంకా వాతావరణం చల్లగా వుండటంతో నోరూరించే వేడి వేడి పదార్థాలను ఎక్కువగా లాగించేయాలనిపిస్తుంది. కానీ వర్షాకాలంలో గాన

Selvi| Last Updated: గురువారం, 12 జులై 2018 (11:46 IST)
వర్షాకాలంలో దాహం వేయదు. చెమట పట్టదు. వ్యాయామం చేయాలనిపించదు. శారీరక శ్రమ అంతగా వుండదు. ఇంకా వాతావరణం చల్లగా వుండటంతో నోరూరించే వేడి వేడి పదార్థాలను ఎక్కువగా లాగించేయాలనిపిస్తుంది. కానీ వర్షాకాలంలో గానీ, శీతాకాలంలో కానీ నూనెల్లో వేయించిన పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇష్టమొచ్చినట్లు ఆహారం తీసుకుంటే అనారోగ్యం పాలవడమే కాకుండా, బరువు పెరిగిపోతారని వారు హెచ్చరిస్తున్నారు. అలా వర్షాకాలంలో బరువు పెరగకుండా వుండాలంటే.. వేడి వేడి, నూనెలో వేపే బజ్జీలు, సమోసాలు వంటి ఆహార పదార్థాలకు దూరంగా వుండాలి. ఇంకా తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోకుండా వుండటం మంచిది. అలాగే పార్టీలకు వెళ్లినా.. అక్కడ వెరైటీలు కంటి ముందు కనిపిస్తున్నా.. మితంగా తినాలి. 
 
నూనెతో చేసిన పదార్థాలకు దూరంగా వుండాలి. నెయ్యిని పక్కనబెట్టేయాల్సిందే. రాత్రిపూట మితంగా తీసుకోవడం.. ఒక వేళ మాంసాహారం తీసుకుంటే, పండ్లు, సలాడ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా ఆకుకూరలు, పండ్లు, డ్రై ప్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :