శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2016 (11:43 IST)

అల్లాన్ని ఆహారంలో వాడండి.. బ్లెడ్ క్యాన్సర్‌కు చెక్ పెట్టండి..

అల్లాన్ని దూరం చేసుకుంటే ఆరోగ్యం కూడా దూరమైనట్లే. జీర్ణ సంబంధిత ఇబ్బందులను అల్లం మటాష్ అవుతుంది. గర్భిణీ స్త్రీలలో రెండవ నెల ఆరంభంతోనే వాంతులు అవడం, తలతిరుగుడు, నడుం బాధలు లాంటివి వస్తుంటాయి. అరుగుదల

అల్లాన్ని దూరం చేసుకుంటే ఆరోగ్యం కూడా దూరమైనట్లే. జీర్ణ సంబంధిత ఇబ్బందులను అల్లం మటాష్ అవుతుంది. గర్భిణీ స్త్రీలలో రెండవ నెల ఆరంభంతోనే వాంతులు అవడం, తలతిరుగుడు, నడుం బాధలు లాంటివి వస్తుంటాయి. అరుగుదల లేకపోవడం వంటి వాటిని మార్నింగ్‌ సిక్‌నెస్‌ అంటారు. దీనిని అల్లం బాగా తగ్గిస్తుంది. ఇంటెస్టినల్‌ గ్యాస్‌ను అల్లం ఎలిమినేట్‌ చేస్తుంది.
 
జలుబు, ఫ్లూను నివారించేందుకు చికిత్స చేయటానికి కూడా అనాదిగా వైద్యులు, ఆయుర్వేద శాస్త్రకారులు అల్లాన్ని ఉపయోగించారు. గుండెలో మంట వచ్చినప్పుడు అల్లం తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. కేన్సర్‌ ట్యూమర్స్‌ పెరగనీయదు. అల్లాన్ని నిమ్మరసంలో ఊరబెట్టి అజీర్ణం అనిపించినప్పుడు తింటుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. అల్లం సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. అందుకే వంటింట్లో అల్లానికి చోటివ్వాలి.
 
అల్లం త్వరగా పాడవకుండా ఉండాలంటే ఇసుక కుండీలో గానీ, పెరటిలోగానీ పాతిపెట్టినా చాలా కాలం నిల్వ ఉంటుంది. కాల్చిన అల్లాన్ని శొంఠి అంటారు. శొంఠిని పొడిగా చేసి అర స్పూన్‌ పొడి, అర స్పూన్‌ పంచదార కలుపుకొని పరకడుపున తినాలి. బ్లెడ్‌ క్యాన్సర్‌ను నిరోధించడంలో బాగా పని చేస్తుంది. కనుక అల్లాన్ని ఆహారంలో వాడడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.