అల్లం నోటి దుర్వాసనను దూరం చేస్తుందట..

మంగళవారం, 2 జనవరి 2018 (09:45 IST)

అల్లం రసానికి సమానంగా తేనె కలిపి ఓ టీస్పూన్ చొప్పున మూడు పూటలా సేవిస్తే దగ్గు, ఉబ్బసం, జలుబు, అజీర్తి సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. రెండు టీ స్పూన్‌ల అల్లం రసంలో ఒక టీ స్పూన్‌ తేనె కలిపి తాగితే.. తరుచూ కలిగే జలుబు, అలర్జీ సమస్యలు తొలగిపోతాయి. అల్లం రసాన్ని కొంచెం వేడి చేసి, రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గుతుంది. 
 
సన్నగా తరిగిన అల్లం ముక్కలు, జీలకర్ర సమానంగా కలిపి నేతిలో దోరగా వేయించి ప్రతి ఉదయం పరగడపున తింటే అసిడిటీ దూరమవుతుంది. అల్లం, బెల్లం, నువ్వులు వీటిని సమానంగా దంచి ఉసిరికాయ ప్రమాణంలో రెండు పూటలా తింటూ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లం మంచి యాంటీయాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. 
 
రక్త శుద్ధికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అల్లం కొన్ని వారాల పాటు వాడితే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాను నశింపజేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నువ్వుండలు పిల్లలకు తినిపిస్తే ఏమౌతుంది?

నువ్వులు, బెల్లం కలిపి చేసిన నువ్వుండలు పిల్లలకు తినిపిస్తే శీతాకాలంలో జలుబు, దగ్గును ...

news

చలికాలంలో కందుల సూప్ తాగితే..?

శీతాకాలంలో కందులు (పచ్చిగా వుండే కంది గింజలు) తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ...

news

టైమ్‌కు తినకపోతే.. కంటినిండా నిద్ర లేకపోతే... ఆరోగ్య సమస్యలే

పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోకపోవడం.. ఆహారాన్ని సమయానికి తీసుకోకపోవడం, సరైన సమయానికి ...

news

రాత్రి నిద్రించేందుకు ముందు గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే?

పండ్లరసాలతో బరువు తగ్గొచ్చు అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. అయితే ఆ పండ్ల రసాలు ఇంట్లో ...