గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (11:41 IST)

విచ్చలవిడి శృంగారంతో అంటువ్యాధులు.. మందుల్ని తట్టుకుని వ్యాపిస్తాయట.. బీ కేర్ ఫుల్..

విచ్చలవిడి శృంగారం అనారోగ్య సమస్యలు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. విచ్చలవిడి శృంగారం ద్వారా గనేరియా, సిఫిలిస్, క్లమిడియా వంటి సెక్స్ సంబంధిత అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని ప్రపంచ ఆ

విచ్చలవిడి శృంగారం అనారోగ్య సమస్యలు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. విచ్చలవిడి శృంగారం ద్వారా గనేరియా, సిఫిలిస్, క్లమిడియా వంటి సెక్స్ సంబంధిత అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వ్యాధులకు కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మందులు వాడినా అవి ఆ తట్టుకొని వ్యాప్తి చెందుతున్నాయని పేర్కొంది. 
 
ఈ రోగాలున్న వారు వైద్యులను కలిసి సరైన మందుల డోస్‌ను వాడాలని లేకుంటే అంటువ్యాధులతో ఇబ్బందులు తప్పవని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచించింది. గనేరియా వ్యాధి గొంతువరకు విస్తరించే ప్రమాదం ఉందని, క్లమిడియా వ్యాధి ఉన్న రోగులకు మూత్రం విసర్జన సమయంలో విపరీతమైన మంట ఉంటుందని  ప్రపంచ ఆరోగ్య సంస్థ మెడికల్ ఆఫీసర్ టియోడోరా వెల్లడించారు. 
 
ఇక మూడోది సిఫిలీస్ వ్యాధి తల్లి నుంచి శిశువులకు వ్యాపించడం వల్ల గర్భస్త మరణాలు సంభవించే ప్రమాదముందని టియోడోరా వివరించారు. అందుచేత విచ్చలవిడిగా శృంగారం వద్దని, శృంగారంలో పాల్గొనేటప్పుడు కండోమ్‌లు వంటివి ఉపయోగిస్తే అంటువ్యాధులను దూరం చేసుకోవచ్చునని టియోడోరా తెలిపారు.