గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 11 నవంబరు 2016 (17:50 IST)

యంగ్‌గా ఉండాలా ద్రాక్ష పండ్లు తినండి.. హాయిగా నిద్రపట్టాలంటే.. పాలకూరను?

ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా నిత్యయవ్వనులుగా ఉండవచ్చు. ఇందులోని సి విటమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే రా

ద్రాక్షపండ్లను తీసుకోవడం ద్వారా నిత్యయవ్వనులుగా ఉండవచ్చు. ఇందులోని సి విటమిన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది శరీరానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే రాత్రి పూట హాయిగా నిద్రపోవాలంటే ద్రాక్ష పండ్లను తీసుకోవాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
ద్రాక్షలో నిద్రకు సహాయపడే మెలటోనిన్‌ అనే హార్మోన్‌ ఉంటుంది. ఇది హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది. అలాగే ద్రాక్ష పండ్లలో గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫినోల్స్‌, ఫ్లెవనాయిడ్స్‌ అధిక మొత్తంలో ఉన్నాయని.. తద్వారా గుండెపోటు, హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు. 
 
ఇకపోతే.. పాలకూరలో అధికంగా ఉండే పోటాషియం, క్యాల్షియం రాత్రిపూట హాయిగా నిద్రపోవడానికి సహకరిస్తాయి. అంతేకాదు, ప్రతిరోజూ పాలకూర తినే వాళ్లకు ఒత్తిడి, తలనొప్పి, కండరాలు, కీళ్లనొప్పి దరిచేరవు. దీంతో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖంగా నిద్రపోవచ్చు. ఒక కప్పు నీటిలో రెండు పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారేదాకా ఉంచి తర్వాత వడగట్టి చక్కెర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నిద్రపోవడానికి అరగంట ముందు తాగితే హాయిగా నిద్రపోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.