పచ్చి అరటి పండు తింటే బరువు తగ్గుతారట..

ఆదివారం, 4 జూన్ 2017 (16:36 IST)

రాత్రిపూట పచ్చి అరటి పండును తింటే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు తింటే లావైపోతారనేది అపోహ మాత్రమేనని.. పచ్చి అరటితో బరువును తగ్గించుకోవచ్చునని వారు సూచిస్తున్నారు. అరటి పండులోని విటమిన్ బి-6, శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగించి, అధిక బరువును నియంత్రిస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే మినరల్స్ జీర్ణప్రక్రియను సులభతరం చేస్తుంది.
 
నీరసం, బద్ధకం వంటి లక్షణాల నుంచి బయటపడేస్తుంది. అలాగే బాదం పప్పు, విటమిన్ 'సి' జాతికి చెందిన తాజా పండ్లు, శెనగలు, గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్ వంటివి కూడా శరీరంలోని అధిక బరువును నియంత్రించి ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు సహకరిస్తాయి. వీటితో పాటు మాంసాహారం అలవాటు ఉన్నవారైతే సాల్మన్ చేపను తరచూ తినడం వల్ల శరీరంలో కొవ్వును దరిచేరనివ్వకుండా జాగ్రత్తపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రుతుక్రమ సమస్యలను దూరం చేసే జామకాయ

జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు ...

news

పాప్ కార్న్‌‌తో మేలెంతో తెలుసా?

పాప్ కార్న్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ...

news

బ్రేవ్.. బ్రేవ్.... గ్యాస్ ట్రబుల్ అడ్డుకోవడమెలా? ఏం తింటే ఆగుతుంది?

కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, బ్రేవ్ బ్రేవ్ మంటూ త్రేన్పులు. కూర్చున్నచోట కూర్చోలేని ...

news

బానపొట్ట తగ్గాలా? రాత్రి పూట ఈ డ్రింక్ తాగండి

కీరదోసకాయ నిమ్మపండు రసం, అల్లం పేస్టు, కలబంద జ్యూస్‌ను మిక్సీలో మెత్తగా రుబ్బుకుని.. ఆ ...