శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 31 జులై 2015 (15:55 IST)

నాన్ వెజ్ కంటే పాలకూర తినండి... అందులోనివన్నీ ఇందులో కూడా...

ఆకుకూరల్లో కొత్తిమీరను కూరల్లో వాసన అదిరిపోద్ది. ఈ కొత్తిమీర పుష్టిని ఇస్తుంది. ప్రతి వందగ్రాముల కొత్తిమీరలో... పదిమిల్లీగ్రాముల ఐరను, 135 మిల్లీగ్రాముల విటమిన్ సి, విటమిన్ ఏలతోపాటు, ఫాస్ఫరస్, కాల్షియం సమృధ్ధిగా లభిస్తాయి. చట్నీ, జ్యూస్ రూపంలో తీసుకుంటే ఈ పోషక విలువలు మన శరీరానికి అందుతాయి. 
 
పప్పు, కూర, పులుసు, బజ్జీలు, పాలక్ పన్నీర్... రకరకాలుగా తినే పాలకూరల్లో అమినోయాసిడ్స్, ఐరన్, విటమిన్ ఎ, మెగ్నీషియం, సల్ఫర్, పోటాషియం, పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఒక్కమాటలో చెప్పమంటే మాంసాహారంలో ఉండే మాంసకృత్తులన్నీ పాలకూరలోనూ ఉంటాయి. 
 
పాలకూరలో ఉండే సుగుణాలన్నీ మెంతికూరలోనూ లభిస్తాయి. ఖనిజ లవణాలతో పాటు.. అన్ని పరిమళభరిత పుదీనాలోనూ విటమిన్లకు, ఖనిజలవణలకు కొదవేమీలేదు. ఐరన్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. తోటకూర తరచుగా తినడంవల్ల ఎ, బి1, బి2, సి విటమిన్లు.. కాల్షియం, ఐరన్, పొటాషియం, లోపాలకు చక్కని పరిష్కారం. చర్మాన్ని తొందరగా ముడతలు పడనీయదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.